ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అవకాడోను కేవలం 'సూపర్‌ఫుడ్'గా కాకుండా, దానిని సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చేసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మెడిటరేనియన్ డైట్ ఈ విషయంలో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చేపలు ,ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 అవకాడోను ఆహారంలో సులభంగా చేర్చుకోవడానికి కొన్ని మార్గాలు..  

స్మూతీలలో: ఉదయం అల్పాహారంలో అవకాడో, అరటిపండు, పాలు కలిపి ఆరోగ్యకరమైన స్మూతీని తయారు చేసుకొని తీసుకోవచ్చు.  
టోస్ట్‌పై: బ్రెడ్‌పై వెన్నకు బదులుగా అవకాడోను గుజ్జు వేసి టోస్ట్ చేసుకుని తినొచ్చు.
సలాడ్‌లలో: సలాడ్‌లలో అవకాడో ముక్కలను కలిపితే రుచితో పాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు.  
 
శాండ్‌విచ్‌లలో: చీజ్‌కు బదులుగా శాండ్‌విచ్‌లలో అవకాడో ముక్కలను యాడ్ చేసుకోవచ్చు.  

అందరికీ అవకాడో ప్రయోజనకరమేనా అంటే..?

అవకాడో ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనప్పటికీ, ఇది కొవ్వు అధికంగా ఉండే పండు అని గుర్తుంచుకోండి. కాబట్టి, బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారు లేదా ప్రత్యేక డైట్‌లు అనుసరిస్తున్న వ్యక్తులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే అవకాడో  తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా అధిక పరిమాణంలో అవకాడోను తినడం వల్ల కొంతమందికి గ్యాస్ లేదా అజీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.