కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
సాక్షి లైఫ్ : మూత్రపిండాలు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతాయి. ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలు వస్తాయి. మన శరీరంలో మూత్రపిండాలు (కిడ్నీలు) అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, శరీరంలోని వ్యర్థాలను, అదనపు ద్రవాలను మూత్రం ద్వారా బయటకు పంపే కీలకమైన పనిని ఇవి నిర్వహిస్తాయి.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
సోడియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాల సమతుల్యతను కాపాడటంలో, రక్తపోటును నియంత్రించడంలో కూడా కిడ్నీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అయితే, నేటి జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు కిడ్నీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చాలా సార్లు కిడ్నీలు ఇబ్బంది పడుతున్నాయని శరీరం సంకేతాలు ఇస్తుంది, కానీ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాం.
మూత్రపిండాల వ్యాధులు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపించకపోవచ్చు. కానీ వ్యాధి ముదిరే కొద్దీ కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి వైద్యుడిని సంప్రదించడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సత్యనారాయణ సాక్షి లైఫ్ కు తెలిపారు. కిడ్నీ వ్యాధిని సూచించే ముఖ్యమైన లక్షణాలు ఏమిటో అవి ఎలా ఉంటాయో ఈ కింది వీడియో లో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.