వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
సాక్షి లైఫ్ : గుండెపోటు.. ప్రస్తుతం వృద్ధులనే కాదు, యువతను కూడా కలవరపెడుతున్న తీవ్రమైన సమస్య. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, రోజువారీ ఆహారంలో చిన్నపాటి మార్పు చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని మీకు తెలుసా? దీనికి పరిష్కారం అవకాడో! సరైన పద్ధతిలో అవకాడోను ఆహారంలో చేర్చుకుంటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇటీవల 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం సంచలనం సృష్టించింది. ఒక వ్యక్తి వారానికి కేవలం రెండుసార్లు అవకాడోను తీసుకుంటే, అతనికి గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 16శాతం నుంచి 21శాతం వరకు తగ్గుతుందని ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా, మీరు మీ రోజువారీ ఆహారంలో వెన్న, చీజ్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం వంటి వాటికి బదులుగా అవకాడోను చేర్చుకుంటే, అది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది.
అవకాడో గుండెను ఎలా ఆరోగ్యంగా ఉంచుతుంది..?
అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డి ఎల్) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డిఎల్) స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. దీంతో పాటు, అవకాడోలో డైటరీ ఫైబర్, విటమిన్-ఇ, బీటా-సిటోస్టెరాల్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఈ పోషకాలు రక్తనాళాలను శుభ్రపరచడంలో శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో తోడ్పడతాయి. ఈ అన్ని పోషకాలు కలిసి గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణమైన రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కాలేయం దెబ్బతింటుందని సూచించే సంకేతాలు ఇవే..
ఇది కూడా చదవండి..హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..