ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?
సాక్షి లైఫ్ : ప్రయాణం చేసే సమయంలో మొబైల్ ఉపయోగించడం లేదా పని సమయంలో ల్యాప్‌టాప్‌పై వంగి కూర్చోవడం, సరైన విధంగా కూర్చోకపోవడం లేదా ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండడం వంటివి వెన్నునొప్పికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. మెడ వంచి స్క్రీన్ వైపు చూస్తే మెడ, వీపు, వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. సాధారణ స్థితిలో, మెడ, వెనుకభాగం నిటారుగా ఉంటాయి కానీ నిరంతరం వంగడం వల్ల వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల పలురకాల అనారోగ్య సమస్యలు వస్తాయి..
ఇది కూడా చదవండి..అనస్థీషియా ఎన్ని రకాలు..?
ఇది కూడా చదవండి..ప్రపంచంలో ఉత్తమ ఆరోగ్యకరమైన ఆహారాలు..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
గంటల తరబడి స్క్రీన్ పై గడపడం వల్ల కంటి సంబంధిత సమస్యలు పెరిగి కంటి చూపునకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాదు మెడ బిగుసుకుపోవడం, భుజం నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు రావడమేకాకుండా మానసిక ఒత్తిడి పెరిగి మరిన్ని అనారోగ్య సమస్యల బారీన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.