స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..?
సాక్షి లైఫ్ : మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ధూమపానం, మద్యపానం, గుండె జబ్బులు ఉన్నవారికి, రక్తంలో హిమోగ్లోబిన్ అధికంగా ఉండటం, శరీరంలో నీటిశాతం తగ్గడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ. స్ట్రోక్ లక్షణాల కనిపిస్తే రోగిని వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అక్కడ స్ట్రోక్ రకాన్ని నిర్ధారించడానికి మెదడు సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ చేస్తారు. ఎందుకంటే ఇస్కీమిక్ స్ట్రోక్ కు, హెమరేజిక్ స్ట్రోక్ కు చికిత్స వేర్వేరుగా ఉంటుంది. రోగి స్ట్రోక్ ఇస్కీమిక్ రకం అయితే, మెదడులోని రక్త ప్రవాహాన్ని థ్రోంబోలిసిస్ పద్ధతి ద్వారా పునఃప్రారంభించవచ్చు.
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
పక్షవాతం వస్తే..
థ్రోంబోలిసిస్ పద్ధతి ద్వారా, రోగి సిరల్లో రక్తం గడ్డలను ఇంజెక్షన్ ద్వారా తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇంజక్షన్ వ్యాధి ప్రారంభమైన 4.30 గంటల లోపు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల, రోగిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. థ్రాంబోలిసిస్ విధానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా లభించే ఎల్‌టీపీలాష్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు. రోగి రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచడంతోపాటు ధూమపానం మానేయడం వల్ల పక్షవాతం ముప్పు తగ్గుతుందని వైద్యలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ ఎలా పని చేస్తాయి..?
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
