కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

సాక్షి లైఫ్ : శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. ఇవి శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాదు రక్తాన్ని ఫిల్టర్ చేయడంలోనూ ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. దీర్ఘకాలం పాటు కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి ముందుగా కొన్నిరకాల లక్షణాలను  ఫాలో అవ్వడం ద్వారా జాగ్రత్తపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. కిడ్నీ డ్యామేజ్ అయ్యేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..   

 

ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

 

 కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని గుర్తించి వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. కొన్ని సార్లు కిడ్నీ సంబంధిత సమస్యలు  ఉదయాన్నే కనపడుతాయి. అవేంటంటే..?  

 అలసట- బలహీనత..

 ఉదయాన్నే నిద్రలేచినప్పుడు అలసిపోయినట్లు, బలహీనంగా అనిపిస్తే , ఇది కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. కిడ్నీ సమస్యల వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం మొదలవుతుంది. దీని కారణంగా  ఉదయం నిద్రలేవగానే అలసటగా అనిపించవచ్చు.

మూత్రవిసర్జనలో మార్పులు.. 

 ఉదయాన్నే మూత్రం రంగు, పరిమాణంలో మార్పులు కనిపిస్తాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యానికి ముఖ్యమైన సూచికగా చెప్పవచ్చు. మీ మూత్రం చాలా లేతగా, నురుగుగా లేదా అసాధారణ రంగులో ఉంటే లేదా మీరు తరచుగా మూత్ర విసర్జన చేయవలసి వచ్చినట్లయితే, అది కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు.

కడుపు ఉబ్బరం.. 

మీరు ఉదయం నిద్రలేవగానే కడుపులో ఉబ్బరంగా అనిపిస్తే, అది మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడానికి సంకేతం కావచ్చు.

దాహం ఎక్కువ.. 

 ఉదయం లేవగానే దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది. ఇది కూడా కిడ్నీల ఆరోగ్యం సరిగాలేనప్పుడు కనిపించే మరొక సంకేతం కావచ్చు. కిడ్నీ సమస్యలు శరీరంలో నీటి సమతుల్యతను దెబ్బతీస్తాయి. దీని కారణంగా మరింత దాహం వేస్తుంది.

చర్మం దురద.. 

కిడ్నీ సమస్యల కారణంగా, శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల చర్మంపై దురద, దద్దుర్లు లేదా ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ మీకు ఉదయం నిద్రలేవగానే చర్మంలో అసాధారణమైన దురద సమస్యలు ఎదుర్కొంటుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యనిపుణులను సంప్రదించండి.

 

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

Tags : kidneys-health kidney-health kidney kidney-failure kidney-related-problems kidney-failure-symptoms kidney-disease-symptoms symptoms-of-kidney-failure symptoms-of-kidney-disease signs-of-kidney-disease chronic-kidney-disease kidney-disease early-signs-of-kidney-disease signs-of-kidney-problems warning-signs-of-kidney-failure
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com