సాక్షి లైఫ్ : రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, కొలెస్ట్రాల్, ఊబకాయం, పొగాకుకు దూరంగా ఉండటం, మద్యపానానికి దూరంగా ఉండటం,ఒత్తిడిని తగ్గించడం వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులను నిర్వహించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అయితే స్ట్రోక్ ప్రమాదాన్ని మరింతగా పెంచే పలురకాల ఆహారాలున్నాయి. అవేంటంటే..?
ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..?
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?
ఇవిస్ట్రోక్ ప్రమాదాన్ని కలిగిస్తాయి..
మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరాకు అంతరాయం లేదా సరఫరా తగ్గిపోయినప్పుడు సాధారణంగా స్ట్రోక్ సంభవిస్తుంది. ఇది మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం, వ్యాయామం లేకపోవటం లేదా నిశ్చల జీవనశైలి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే అనేక జీవనశైలి కారకాలు ఉన్నాయి.
రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, కొలెస్ట్రాల్, ఊబకాయం, పొగాకుకు దూరంగా ఉండటం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఒత్తిడిని తగ్గించడం వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులను నిర్వహించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రెగ్యులర్ వ్యాయామం,సమతుల్య ఆహారం కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు మీ డైట్‌లో అస్సలు చేర్చుకోకూడని ఆహార పదార్థాలున్నాయి..
స్ట్రోక్ ను నివారించడానికి, ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
1. ప్రాసెస్ చేసిన ఆహారం..
జంక్ ఫుడ్ ప్రతి రోజు తీసుకుంటున్నట్లయితే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది మీ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. చిప్స్, ఫ్రైడ్ లేదా ఫ్రోజెన్ ఫుడ్స్ వంటి ప్రాసెస్ చేసిన లేదా జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ధమనులలో అడ్డుపడే ఎల్డీ ఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల స్ట్రోక్, గుండెపోటు వంటి అనేక వ్యాధులకు కారణమవుతుంది.
2. ప్రాసెస్ చేసిన మీట్..
కాల్చిన, ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం నైట్రేట్ వంటి కొన్ని ప్రిజర్వేటివ్స్ ను కలిగి ఉంటాయి, ఇవి రక్త నాళాలను దెబ్బతీస్తాయి. తద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ప్రాసెస్ చేసిన నాన్ వెజ్ ఫుడ్ ను వినియోగాన్ని తగ్గించాలి.
3. ఉప్పు..
ఉప్పు అనేది క్యాన్డ్ ఫుడ్స్, టేబుల్ సాల్ట్‌ని సూచిస్తుంది, ఇందులో ప్రాసెస్ చేసిన ఉప్పు ఉంటుంది. హిమాలయన్ ఉప్పు వంటి సహజమైన, ప్రాసెస్ చేయని ఉప్పు, స్ట్రోక్ రిస్క్ ఉండదు. కాబట్టి ఆహార రుచిని మెరుగుపరచడానికి ప్రాసెస్ చేయని సాల్ట్ ను ఉపయోగించవచ్చు. ఉప్పు రక్తపోటును పెంచుతుంది, ఇది ధమనులు, మెదడు, గుండెకు హాని కలిగిస్తుంది. రోజుకు 5 గ్రాముల ఉప్పు కంటే తక్కువగా తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
4. శీతల పానీయాలు..
మార్కెట్‌లో లభించే డైట్ డ్రింక్స్ వాస్తవానికి వినియోగదారులను మోసం చేయడానికి ఉద్దేశించినవి. సోడా బాటిల్‌పై 'డైట్' అని రాస్తే ఆరోగ్యానికి తక్కువ హాని జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే, శీతల పానీయాల వినియోగం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com