సాక్షి లైఫ్ : చిన్నారుల్లో లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా పిల్లలలో కనిపించే ఓ రకమైన క్యాన్సర్. అయితే సకాలంలో చికిత్స, రోగ నిర్ధారణ చాలా ముఖ్యమైంది. ముందుగా వ్యాధి లక్షణాలను గుర్తిస్తే తప్పకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు. అందుకోసం అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అంచనా ప్రకారం 2023లో యునైటెడ్ స్టేట్స్‌లో పెద్దలు, పిల్లలలో అన్నిరకాల క్యాన్సర్ కలిపి దాదాపు 60 వేల కొత్త లుకేమియా కేసులు వచ్చాయి. ఇందులో 24 వేల మంది చనిపోయారు.
బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి..? అది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?
లుకేమియా అనేది బ్లడ్ క్యాన్సర్, ఇది అంటువ్యాధులతో పోరాడే తెల్ల రక్త కణాలను ప్రభావితం చేస్తుంది. శరీర రోగనిరోధక వ్యవస్థలో తెల్ల రక్త కణాలు ప్రధాన భాగం. ఈ కణాలు ప్రభావితమైనప్పుడు, ఎముక మజ్జలో అసాధారణ తెల్ల కణాలు ఉత్పత్తి అవుతాయి, ఇవి రక్తప్రవాహం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణిస్తాయి, ఆరోగ్యకరమైన కణాలపై ఒత్తిడి తెస్తాయి.
ఈ ఆరోగ్యకరమైన కణాలు అసాధారణంగా మారినప్పుడు, శరీరం అంటువ్యాధులు లేదా ఇతర వ్యాధులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. తద్వారా శరీరంలోని ఇమ్మ్యూనిటీ పవర్ బలహీనంగా మారుతుంది. పిల్లలు ,యువకులు అటువంటి ఇన్ఫెక్షన్లతో పెద్దల కంటే బలంగా పోరాడగలుగుతారు. అందువల్ల యువకులు క్యాన్సర్ చికిత్సకు మెరుగ్గా స్పందిస్తారు.
పిల్లలలో బ్లడ్ క్యాన్సర్ ప్రమాద కారకాలు..?
పిల్లల్లో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వారసత్వం. కుటుంబంలో ఎవరైనా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లయితే వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీనిని లి-ఫ్రామెని సిండ్రోమ్ అంటారు, దీని అర్థం 'వంశపారంపర్య క్యాన్సర్ సిద్ధత'. ఐతే వ్యాధి సోకిన జన్యువులను బట్టి పిల్లల్లో క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
గతంలో ఏదైనా చికిత్స సమయంలో బిడ్డ ఏదైనా రకమైన రేడియేషన్ థెరపీకి గురైతే లేదా బెంజీన్ వంటి రసాయనాలను అతిగా వినియోగించినట్లయితే, బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
పిల్లలలో బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు..?
చాలా మంది పిల్లలు లుకేమియాతో బాధపడుతున్నప్పుడు ఎటువంటి అసాధారణ లక్షణాలు లేదా సంకేతాలు కనిపించకపోవచ్చు. ఇది రోగనిరోధక-సంబంధిత వ్యాధి. కాబట్టి రోగనిరోధక వ్యవస్థ తగ్గినట్లుగా ఏమైనా లక్షణాలు కలిగి ఉంటే, దానిని క్యాన్సర్ గా మాత్రం భావించలేమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
విపరీతమైన అలసట..
చిన్నారులు అన్ని వేళలా అలసిపోయినట్లు అనిపిస్తే, లేదా ఇతర పిల్లలతో ఆడుకుంటూ శారీరకంగా వ్యాయామం చేయలేక పోతే, ఇది రోగనిరోధక వ్యవస్థ తగ్గినట్లు గుర్తించాలి.
రక్తస్రావం లేదా గాయాలు..
పిల్లల్లో చిన్న గాయాలు కొన్ని రోజులకే తగ్గుతాయి. వీటిలో కొన్ని తీవ్రమైనవి కూడా ఉండొచ్చు. అప్పుడు ఆ గాయాలు ఎక్కువరోజులు గడిచినా తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం మంచిది.
ఇన్ఫెక్షన్ - జ్వరం..
పిల్లల్లో ,పెద్దల్లో అన్ని రకాల క్యాన్సర్లలో ఇది సాధారణ లక్షణం. నిరంతర జ్వరం వస్తూఉంటే తప్పనిసరిగా వైద్యుడిని కలిసి అవసరమైన పరీక్షలు చేయించాలి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా దగ్గు..
విపరీతమైన దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే..? కొన్ని పరీక్షలు చేయించడం ద్వారా లుకేమియా ప్రమాదాన్ని ముందుగా గుర్తించవచ్చు.
కొంతమంది చిన్నారుల్లో చిగుళ్ల సమస్యలు, శరీరంపై దద్దుర్లు, బరువు తగ్గడం, శరీరంలోని ఏదైనా భాగంలో మళ్లీ మళ్లీ వాపు రావడం, కీళ్ల నొప్పులు, మూర్ఛలు, తలనొప్పి, వాంతులు ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com