గవదబిళ్లల వ్యాధి అంటే ఏమిటి..? లక్షణాలు-నివారణ..?
సాక్షి లైఫ్ : గవదబిళ్లల వ్యాధి అనేది ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించే ఒక అంటు వ్యాధి. ఈ సమస్య పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. పెద్దల్లో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు టాన్సిల్స్ మాదిరిగానే ఉంటాయి. దీని కారణంగా ప్రజలు దానిని విస్మరిస్తే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఇది గొంతు, చెవులు రెండింటికి హాని కలిగించే వ్యాధి. గవదబిళ్లల లక్షణాలు.. నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తి తగ్గడం..
బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా శరీరం త్వరగా వ్యాధులకు, ముఖ్యంగా అంటు వ్యాధులకు గురవుతుంది. గవదబిళ్లల వ్యాధి కూడా అలాంటిదే. ఈ వ్యాధి విషయంలో చెవుల చుట్టూ వాపు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా వరకు దాని లక్షణాలు టాన్సిల్స్ మాదిరిగానే ఉంటాయి. అందుకే కొన్నిసార్లు ప్రజలు దీనిని విస్మరిస్తారు. దీంతో ఆయా వ్యాధి ముదిరిపోతుంది.
ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంటలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..?
గవదబిళ్లలు అంటే ఏమిటి..?
గవదబిళ్లలు అనేది పారామిక్సోవైరస్ అనే వైరస్ వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. ఇందులో లాలాజల గ్రంథిలో వాపు, నొప్పి తలెత్తుతుంది. ఈ వైరస్ నాసికా స్రావాలు, లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. గవదబిళ్లల వ్యాధి వచ్చిన వ్యక్తి నుంచి ఆ లక్షణాలు మరొక వ్యక్తికి త్వరగా వ్యాపిస్తాయి.
గవదబిళ్లల వ్యాధి లక్షణాలు..
గవదబిళ్లల వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. గవదబిళ్లల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిలో తలనొప్పి, జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిలో దవడ వాపు కూడా కనిపిస్తుంది. గవదబిళ్లలు సోకిన మొదటి 48 గంటలలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. గవదబిళ్ళలు, టాన్సిల్స్ లక్షణాల గురించి ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతారు. దీని కారణంగా చాలాసార్లు ప్రజలు ఇంటి చిట్కాలతో వాటిని నయం చేయడానికి ప్రయత్నిస్తారు.
వైద్యుడిని సంప్రదించాలి..
అయితే గవదబిళ్లల వ్యాధి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. కొన్నిసార్లు దాని లక్షణాలు కనిపించడానికి సమయం పడుతుంది. అప్పటికే పారామిక్సోవైరస్ చెవి చుట్టుపక్కల అవయవాలకూ సోకుతుంది. దీని వల్ల వినికిడి శక్తి కూడా తగ్గుతుంది. గవదబిళ్లల వ్యాధిని గుర్తించేందుకు రక్త పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రుబెల్లా, ఎమ్ ఆర్ టీకా ప్రభావవంతంగా ఉంటుంది. గవదబిళ్లల సమస్య పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని నివారించాలంటే పిల్లలకు రుబెల్లా, ఎంఆర్ టీకాలు వేయించాల్సి ఉంటుంది.
గవదబిళ్లల నివారణ ఎలా..?
ఇది ఒక అంటు వ్యాధి కాబట్టి. దాని నుంచి సురక్షితంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా పిల్లలలో లేదా వ్యక్తిలో లక్షణాలు కనిపిస్తే, సోకిన వ్యక్తిని కొన్ని రోజులు వేరుగా ఉంచాలి. ఈ వ్యాధి వచ్చిన వారు మాస్క్ ధరించాలి. అంతేకాదు వాళ్లు ఉపయోగించే వస్తువులను వేరుగా ఉంచాలి. సరిగ్గా శుభ్రపరచిన తర్వాత మాత్రమే వాటిని మళ్లీ ఉపయోగించాలి. అంటు వ్యాధులను నివారించడానికి సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
ఇది కూడా చదవండి.. బరువు తగ్గించే నల్ల ఉప్పు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
