Short Videos Changing Children’s Brains: పిల్లల బుర్రలను మార్చేస్తున్న 'షార్ట్' వీడియోలు.. జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం.. 

షేర్ చేయండి:
Short Videos Changing Children’s Brains: పిల్లల బుర్రలను మార్చేస్తున్న 'షార్ట్' వీడియోలు.. జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం.. 

సాక్షి లైఫ్ : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు గంటల కొద్దీ సినిమాలు, విజ్ఞానం కలిగిన వీడియోలు చూసేవారు. కానీ ఇప్పుడు 'రీల్స్', 'షార్ట్ వీడియోల' హవా నడుస్తోంది. కనురెప్ప మూసి తెరిచేలోపు స్క్రీన్‌పై కొత్త వీడియో ప్రత్యక్షమవుతోంది. అయితే, కేవలం కొన్ని సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలు చిన్నారుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ చెన్ సైతం ఇటీవల దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిన్న వీడియోలు పిల్లలు, యువత ఎదుగుదలకు సవాలుగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్  బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!

ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

ఏకాగ్రత లోపం.. పెరుగుతున్న ఆందోళన..

చిన్నప్పటి నుంచే సెకన్ల వ్యవధిలో ముగిసిపోయే వీడియోలకు అలవాటు పడితే, భవిష్యత్తులో పిల్లలు సుదీర్ఘమైన అంశాలపై దృష్టి సారించలేరని పరిశోధకులు చెబుతున్నారు. ఈ షార్ట్ వీడియోల కారణంగా ప్రతి 15 నుంచి 20 సెకన్లకు ఒక కొత్త విషయం చూడటం మెదడుకు అలవాటైపోతుంది. దీనివల్ల మెదడు నిరంతరం 'కొత్తదనం' కోసం పాకులాడుతుంది. ఫలితంగా 15 నిమిషాల నిడివి గల ఉపయోగ కరమైన వీడియో చూడాలన్నా లేదా ఎక్కువ సేపు పుస్తకం చదవాలన్నా వారికి విసుగు, బోర్ కొట్టడం మొదలవుతుంది. వేగంగా మారిపోయే దృశ్యాల వల్ల పిల్లల్లో ఓపిక నశిస్తోంది. ఒక చోట కూర్చుని నిలకడగా నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతోంది. నిరంతరం స్క్రోలింగ్ చేయడం వల్ల తెలియకుండానే పిల్లల్లో చిరాకు, నిద్రలేమి, విరామం లేకపోవడం (Restlessness) వంటివి పెరుగుతున్నాయి.

మరి తల్లిదండ్రులు ఏం చేయాలి..?

పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

చిన్నారి మెదడుపై షార్ట్ వీడియోల ప్రభావం పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని కీలక నివారణా చర్యలు చేపట్టాలి. ప్రాథమికంగా, సోషల్ మీడియా యాప్స్‌లో అందుబాటులో ఉన్న 'ఏజ్ రిస్ట్రిక్షన్' వయో పరిమితి ఫీచర్లను తప్పనిసరిగా ఉపయోగించాలి.. దీనివల్ల పిల్లలకు వారి వయస్సుకి తగని, అనవసరమైన కంటెంట్ చేరకుండా అడ్డుకోవచ్చు. 

నియంత్రణ అవసరం.. 

కేవలం కంటెంట్‌పైనే కాకుండా, చూసే సమయంపై కూడా నియంత్రణ ఉండాలి. రోజుకు ఎంతసేపు స్క్రీన్ చూడాలనే దానిపై కచ్చితమైన 'టైమ్ లిమిట్' విధించడం ద్వారా డిజిటల్ వ్యసనాన్ని అరికట్టవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, పిల్లలను డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు తీసుకువచ్చేలా ప్రత్యామ్నాయ మార్గాలను ప్రోత్సహించాలి. వీడియోలను చూడడానికి బదులుగా అవుట్ డోర్ గేమ్స్ ఆడించడం, పెయింటింగ్ వేయించడం లేదా ఆసక్తికరమైన కథల పుస్తకాలు చదివించడం వంటివి అలవాటు చేయాలి. ఇవి పిల్లల్లో ఏకాగ్రతను పెంచడమే కాకుండా, వారి సృజనాత్మకతకు పదును పెడతాయి.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.