Biscuits eating Children.. : పిల్లలకు బిస్కెట్లు ఇస్తున్నారా..? జాగ్రత్త.. అవి 'స్లో పాయిజన్' కావచ్చు..!
సాక్షి లైఫ్ : చిన్నారులు అది కావాలి.. ఇది కావాలి అంటూ మారాం చేస్తున్నప్పుడో, ఆకలి అన్నప్పుడో చేతిలో బిస్కెట్ పెట్టడం చాలా మంది తల్లిదండ్రులకు అలవాటు. బిస్కెట్లు తినడానికి రుచిగా ఉండవచ్చు కానీ, వాటిలో శరీరానికి అవసరమైన పోషకాలు శూన్యం. వీటి తయారీలో వాడే పదార్థాలు విషంగా మారుతున్నాయి. లంచ్ బాక్సుల్లోనూ, సాయంత్రం స్నాక్స్‌గానూ ఇవి భాగమైపోయాయి. అయితే, అమాయకంగా కనిపించే ఈ బిస్కెట్లు పిల్లల ఆరోగ్యానికి తీరని హాని చేస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిస్కెట్లు పిల్లల శరీరంలో నెమ్మదిగా విషాన్ని నింపుతున్నాయి.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
బిస్కెట్లలో ఏముంది..?
మైదాలో ఫైబర్ ఉండదు, ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తుంది. అధిక చక్కెర, ఉప్పు.. బిస్కెట్లలో దాగి ఉండే చక్కెర, ఉప్పు మోతాదుకు మించి ఉంటాయి. నిల్వ ఉండటం కోసం వాడే ప్రిజర్వేటివ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి చేటు చేస్తాయి. వీటిలో విటమిన్లు లేదా ఖనిజాలు ఉండవు, కేవలం 'కేలరీలు' మాత్రమే ఉంటాయి.
'టేస్ట్ బడ్స్ పై తీవ్ర ప్రభావం..
బిస్కెట్లలోని కృత్రిమ రుచులు పిల్లల నాలుకపై ఉన్న 'టేస్ట్ బడ్స్'ను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల వారు ఇంట్లో వండిన పప్పు, కూరలు, పండ్లు వంటి సహజమైన ఆహారాన్ని ఇష్టపడరు. ఇది ఒక రకమైన 'ఆహార వ్యసనం' (Food Addiction)గా మారి, భవిష్యత్తులో వారి ఆహారపు అలవాట్లను పూర్తిగా దెబ్బతీస్తుంది.
ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే..?
నిత్యం బిస్కెట్లు తినడం వల్ల చిన్నారుల్లో ఈ క్రింది సమస్యలు తలెత్తవచ్చు. అనవసరపు కేలరీల వల్ల పిల్లలు వయస్సు కంటే ఎక్కువ బరువు పెరుగుతారు. చక్కెర వల్ల పళ్లలో పిప్పి పళ్లు (Cavities) ఏర్పడి, దంతాలు బలహీనపడతాయి. బిస్కెట్లు తిన్న వెంటనే శక్తి వచ్చినట్లు అనిపించినా, అది స్వల్పకాలికమే. ఆ తర్వాత పిల్లలు త్వరగా అలసిపోతారు. అధిక చక్కెర శరీరంలోని జీవక్రియను (Metabolism) దెబ్బతీస్తుంది. అంతేకాదు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది.
బిస్కెట్లకు ప్రత్యామ్నాయంగా ఏం ఇవ్వాలి..?
బిస్కెట్లకు బదులు పిల్లలకు పోషకాహారాన్ని అలవాటు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆపిల్, అరటిపండు, దానిమ్మ వంటి పండ్లు.. చక్కెర లేని మిల్క్ షేక్స్ లేదా ఫ్రూట్ జ్యూస్ లాంటి సహజ పానీయాలు, ప్రోటీన్, కాల్షియం కోసం పెరుగు లేదా పనీర్ వంటి పాల ఉత్పత్తులు అందించాలి. తృణధాన్యాలతో చేసిన ఉప్మా లేదా మెత్తగా ఉడికించిన కూరగాయలు, మిల్లెట్ బిస్కెట్స్ ఇవ్వాలి. రెండు ఏళ్ల లోపు పిల్లలకు అసలు చక్కెర ఇవ్వకపోవడమే మంచిది. పండ్లు మాత్రమే ఇవ్వాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
