Bone-Related Problems : చిన్నారుల్లో పెరుగుతున్న ఎముక సంబంధిత సమస్యలకు  కారణాలివే.. 

షేర్ చేయండి:
Bone-Related Problems : చిన్నారుల్లో పెరుగుతున్న ఎముక సంబంధిత సమస్యలకు  కారణాలివే.. 

సాక్షి లైఫ్ : నేటి తరం పిల్లల్లో శారీరక దృఢత్వం నానాటికీ క్షీణిస్తోంది. ఆటపాటలకు దూరం కావడమే కాకుండా, పోషకాహార లోపం వల్ల ఎముకలు బలహీనపడి వంకర తిరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో దాదాపు 20 శాతం మంది పిల్లలు కాల్షియం లోపంతో బాధపడుతున్నట్లు తేలింది.

మొబైల్  కారణంగా.. 

పిల్లలు అధిక సమయం మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్‌లకే పరిమితం కావడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అలవాటు వల్ల కలిగే పరిణామాలు మరింత ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇళ్లకే పరిమితం కావడం, ముఖ్యంగా శరీరానికి ఏమాత్రం సూర్యరశ్మి తగలకుండా ఉండడం కారణంగా విటమిన్-డి లోపం తలెత్తుతోంది. ఇది ఎముకల పెరుగుదలను దెబ్బతీస్తోంది.

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

పాలు, కూరగాయలు, పప్పుధాన్యాలకు బదులుగా ఫాస్ట్ ఫుడ్, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్‌పై మొగ్గు చూపడం వల్ల కాల్షియం అందడం లేదు. 5 నుంచి 12 ఏళ్ల వయస్సు గల పిల్లల్లో 3 శాతం మందికి కాళ్ల ఎముకలు వంకర పోవడం వల్ల వారి ఎత్తు కూడా పెరగడం లేదు.

యువతలోనూ 'బోలు' ఎముకలు.. 

కేవలం పిల్లలే కాదు, 18 నుంచి 20 శాతం మంది యువత కూడా ఎముకల బలహీనతను ఎదుర్కొంటున్నారు. నడక లేకపోవడం, పోషకాహార లోపం వల్ల చిన్నపాటి గాయాలకే ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్), ముఖ్యంగా తుంటి ఎముక దెబ్బతినడం వంటి సమస్యలు 15 శాతం మంది యువ రోగుల్లో కనిపిస్తున్నాయి.

ప్రధాన లక్షణాలు.. 

తరచూ ఎముకలు విరగడం.

కాళ్ల కండరాల్లో నొప్పి, వాపు.

మెడ, వెన్నెముక నొప్పులు.

నడకలో ఇబ్బందులు, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం.

నివారణ మార్గాలు..?

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవనశైలిలో మార్పులు తప్పనిసరని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అందులోభాగంగా పిల్లలు సూర్యరశ్మి తగిలేలా ఆరుబయట ఆడుకునేలా చూడాలి. అలా చేసినప్పుడే శరీరానికి తగినంత విటమిన్-డి అందుతుంది.  చిన్నారులకు పాలు, లస్సీ, పాల ఉత్పత్తులు ఇవ్వాలి. ఆకుకూరలు, పప్పులు, పండ్లు ఆహారంలో భాగం చేయాలి.

రోజుకు కనీసం 2 నుంచి 3 గంటల పాటు మైదానాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి. పడుకుని మొబైల్ చూడటం, వీపు ఆనుకుని చదవడం మాన్పించాలి. ఇది వెన్నెముక సమస్యలకు దారితీస్తుంది. పిల్లల ఎదుగుదలలో ఎముకల పాత్ర కీలకం. సరైన ఆహారం, శారీరక శ్రమ ఉంటేనే వారి భవిష్యత్తు దృఢంగా ఉంటుందని ఆర్థోపెడిక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.