CKD cases: ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో పెరుగుతున్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు..
సాక్షి లైఫ్ : చిన్నారులు, కౌమార దశలో ఉన్న వారిలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (Chronic Kidney Disease) చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) - 2021 గణాంకాలను విశ్లేషించిన నిపుణులు, ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ సమస్యల తీవ్రత అసమానంగా పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
గణాంకాలు ఏం చెబుతున్నాయి అంటే..?
2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 75.4 లక్షల మంది చిన్నారులు కొత్తగా కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు.
వయస్సు ప్రాధాన్యత: ముఖ్యంగా 14 నుండి 19 ఏళ్ల మధ్య ఉన్న యువతలో ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య 44శాతం మేర పెరగడం గమనార్హం. సెంట్రల్ ఆసియా వంటి ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండగా, తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో మరణాల రేటు ఆందోళనకరంగా ఉంది.
కారణాలు..
ఈ వ్యాధి విస్తరణకు కేవలం శారీరక కారణాలే కాకుండా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా తోడవుతున్నాయి. డయాలసిస్, కిడ్నీ మార్పిడి వంటి అత్యాధునిక చికిత్సలు పేద దేశాల్లోని చిన్నారులకు అందుబాటులో లేకపోవడం వల్ల మరణాలు పెరుగుతున్నాయి. సరైన స్క్రీనింగ్ పరీక్షలు లేకపోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాతే బయటపడుతోంది. దీనివల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
2050 నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది..?
వచ్చే 25 ఏళ్లలో (2050 నాటికి) కిడ్నీ వ్యాధుల రేటు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నప్పటికీ, అది కేవలం అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితం కావచ్చు. పేద, మధ్యతరగతి దేశాల్లో సరైన ఆరోగ్య విధానాలు అమలు చేయకపోతే ఈ ముప్పు మరింత తీవ్రం కానుంది. పిల్లల్లో మూత్రపిండ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేలా పాఠశాల స్థాయి నుంచే స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలి. తల్లిదండ్రులకు పిల్లల ఆహారపు అలవాట్లు, కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. సామాజిక హోదాతో సంబంధం లేకుండా అందరికీ సమానమైన వైద్యం అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
