Digestive Health : తరచూ కడుపునొప్పా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

షేర్ చేయండి:
Digestive Health : తరచూ కడుపునొప్పా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!

సాక్షి లైఫ్ : నేటి ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి కారణంగా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య జీర్ణక్రియ లోపాలు. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, తరచూ కడుపునొప్పి వంటి ఇబ్బందులు కేవలం జీర్ణవ్యవస్థనే కాకుండా.. రోజంతటి ఉత్సాహాన్ని దెబ్బతీస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి, జీవక్రియలు సక్రమంగా సాగాలంటే ప్రేగుల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. కడుపునొప్పితో బాధపడుతున్న ప్పుడు మందులతో పాటు మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అటువంటప్పుడు ఏవి తినాలి, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

 

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది.. 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

కడుపునొప్పిగా ఉన్నప్పుడు ఇవి తీసుకోండి..

  పెరుగులో ఉండే ‘ప్రోబయోటిక్స్’ అంటే మంచి బ్యాక్టీరియా ప్రేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేసి, కడుపుకు ఉపశమనాన్ని ఇస్తాయి.

అరటిపండు సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా విరేచనాలు, కడుపునొప్పి ఉన్నప్పుడు శరీరంలో తగ్గే పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లను ఇది భర్తీ చేస్తుంది.

తేలికపాటి కిచిడీ, గంజి..కడుపు అస్వస్థతగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థపై భారం పడకుండా ఉండాలంటే కిచిడీ లేదా అన్నం గంజి వంటి తేలికపాటి ఆహారాలు ఉత్తమం.

  కొబ్బరినీళ్లు శరీరంలో నీటిశాతం తగ్గకుండా (డీహైడ్రేషన్) చూసేందుకు కొబ్బరినీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలను అందిస్తాయి.

ఉడికించిన కూరగాయలు..

సొరకాయ, క్యారెట్, గుమ్మడికాయ వంటి కూరగాయలను బాగా ఉడికించి తీసుకోవడం వల్ల అందులోని పీచు పదార్థం, పోషకాలు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి.

వేటికి దూరంగా ఉండాలంటే..?

వేపుళ్లు, నూనెలు, మసాలాలు ఎక్కువగా ఉండే వేపుడు పదార్థాలు జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి సమస్యను మరింత జటిలం చేస్తాయి.

జంక్ ఫుడ్స్..పిజ్జాలు, బర్గర్లు, ప్యాకెట్లలో దొరికే చిరుతిళ్లలో కొవ్వులు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపులో మంటను, అసౌకర్యాన్ని పెంచుతాయి.

ఘాటైన మసాలాలు.. కారం, మిరియాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు కడుపులోని లైనింగ్‌ను దెబ్బతీసి అజీర్తికి కారణమవుతాయి.

కూల్ డ్రింక్స్..

కార్బోనేటెడ్ పానీయాలు తాగడం వల్ల కడుపులో గ్యాస్ చేరి, కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.టీ, కాఫీలలో ఉండే కెఫిన్ కడుపులో యాసిడ్ల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా ఎసిడిటీ సమస్య ఎక్కువవుతుంది.రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. వేళ తప్పకుండా భోజనం చేసే అలవాటు చేసుకోవాలి.

రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తేలికపాటి వ్యాయామం, నడక వంటివి అలవర్చుకోవాలి.మానసిక ఒత్తిడి జీర్ణక్రియను దెబ్బతీస్తుంది కాబట్టి, యోగా లేదా ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకుంటే సగం రోగాలు దరిచేరవు. కాబట్టి ఆహార నియమాలు పాటిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..!

 

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.