సాక్షి లైఫ్ : మౌనం మధురమా.. లేక దూరాన్ని పెంచే గోడనా? కొత్తలో మాటలు ఆకాశాన్నంటాయి, మరి ఇప్పుడు మౌనమే రాజ్యమా? వైవాహిక జీవితంలో నిశ్శబ్దం అసలు దేనికి సంకేతం..? ప్రేమలో ఉన్న తొలి రోజుల్లో అంటే హనీమూన్ ఫేజ్ సమయంలో గంటల తరబడి మాట్లాడినా మాటలు అయిపోవు. కళ్లు మూసినా, తెరిచినా మాట్లాడుకోవడమే! కానీ, రోజులు గడిచే కొద్దీ, బంధం స్థిరపడిన తర్వాత, అదే పక్కన కూర్చున్నా మాటలు తగ్గిపోతాయి.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఒకరి పక్కన మరొకరు నిశ్శబ్దంగా గడుపుతున్న ఈ సమయం... అది ఆనందమా..?, లేక ఇద్దరి మధ్య దూరం పెరగడానికి సంకేతమా..? దీనిపై మానసిక నిపుణులు (Psychologists) ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్యకరమైన నిశ్శబ్దం (Healthy Silence) అంటే..?
ఒక బంధంలో నిశ్శబ్దం అనేది కచ్చితంగా ప్రేమకు, నమ్మకానికి సంకేతం కావచ్చు. దీన్ని 'సౌకర్యవంతమైన మౌనం' (Comfortable Silence) అంటారు. నిర్భీతి, నమ్మకం.. మీరు మీ భాగస్వామి ముందు నటించాల్సిన అవసరం లేదు. మాట్లాడాలని ఒత్తిడి లేదు. మీ మనసులో ఏమున్నా వారు అర్థం చేసుకుంటారని నమ్మకం ఉంటుంది.
మానసిక భద్రత (Emotional Safety)..
పక్కన మౌనంగా కూర్చున్నా, మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించదు. మీ భావోద్వేగ సామీప్యత (Emotional Intimacy) లోతుగా ఉన్నప్పుడు, మాటలు లేకపోయినా ఒకరి ఉనికి (Presence) మరొకరికి ప్రశాంతతను ఇస్తుంది.
నాణ్యమైన సమయం..
ఇది మొబైల్‌లోనో, టీవీలోనో మునిగిపోయే మౌనం కాదు. ఇద్దరూ ఒకే గదిలో కూర్చుని, ఒకే పుస్తకం చదవడం లేదా కాఫీ తాగుతూ తమ అభిప్రాయాలు పంచుకోవడం (Sharing Presence). ఇటువంటి నిశ్శబ్దం ప్రశాంతంగా, వెచ్చగా, సురక్షితంగా అనిపిస్తుంది. మనసు శూన్యంగా కాకుండా, నిండుగా ఉన్న భావనను కలిగిస్తుంది.
సమస్యకు సంకేతమైన మౌనం (Troubled Silence)..
మరోవైపు, నిశ్శబ్దం ఆందోళన కలిగిస్తే, అది బంధంలో సమస్యలకు సంకేతం కావచ్చు. దీనిని 'ఎమోషనల్ డిస్టెన్స్' (Emotional Distance) పెరగడం అంటారు. నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, గదిలో భారం, ఉద్రిక్తత (Tension) ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకరికొకరు మాట్లాడుకోవడానికి ఇష్టం లేనట్లు లేదా భయంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిశ్శబ్దం అనేది పరిష్కారం కాని గొడవలు, అణచిపెట్టిన కోపం, నిరాశ లేదా తీరని కోరికల వల్ల ఏర్పడిన భావోద్వేగపు గోడ కావచ్చు.
దూరమైన ఏకాంతం : పక్కపక్కనే కూర్చున్నా ఒంటరితనం (Loneliness) అనుభూతి చెందుతారు. మాట్లాడదామంటే ఏదో భయం లేదా భాగస్వామి వినరనే నిర్లిప్తత ఉంటుంది. మాటలు కేవలం అవసరాలకు (ఉదా: 'ఏం కావాలి?', 'బయటకు వెళ్దామా?') మాత్రమే పరిమితమై, వ్యక్తిగత విషయాలు, భావాల గురించి మాట్లాడుకోవడం పూర్తిగా తగ్గిపోతుంది.
మీ మౌనం దేనికి సంకేతం అంటే..?
మీ బంధంలోని మౌనం మంచిదా, కాదా అని తెలుసుకోవాలంటే ఈ ప్రశ్నలు వేసుకోవాలని సైకాలజిస్టులు చెబుతున్నారు.
భయం ఉందా..? పక్కన కూర్చున్నప్పుడు మీకు ప్రశాంతంగా అనిపిస్తుందా..? లేక మీ భాగస్వామి ఏం ఆలోచిస్తున్నారో అని ఆందోళనగా ఉంటుందా..? ఒకవేళ ఆందోళన ఉంటే సమస్యకు సంకేతమని చెబుతున్నారు సైకాలజిస్టులు.
భావాలు పంచుకోగలరా..? నిశ్శబ్దంగా ఉన్న తర్వాత, మాట్లాడాలని అనిపిస్తే, మీరు ఎలాంటి ఆలోచన లేకుండా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారా..? మాట్లాడటానికి సందేహిస్తే సమస్యగా పరిగణించాలి.
మౌనంగా ఉన్నప్పటికీ, మీ భాగస్వామి ప్రేమగా స్పర్శించడం, చేయి పట్టుకోవడం, భుజంపై చేయి వేయడం వంటి చిన్నపాటి అనుబంధాలు ఉన్నాయా..? ఇవి లేకపోతే స్పర్శ పూర్తిగా లేకపోతే దూరం పెరిగినట్లుగా అర్థం చేసుకోవాలని మానసికనిపుణులు సూచిస్తున్నారు.
నిశ్శబ్దం ఎప్పుడూ ఉంటుంది. కానీ దాని నాణ్యత ముఖ్యం. మీ భాగస్వామికి మీరు భావోద్వేగపరంగా అందుబాటులో ఉన్నంత వరకు, మౌనం ఒక వరం లాంటిది. లేకపోతే అది తీవ్రమైన సమస్యగా మారుతుందని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com