బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?  

సాక్షి లైఫ్ : బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ) అనేది ఒక వ్యక్తి  భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యాన్ని దెబ్బతీసే మానసిక అనారోగ్యం. ఇది తీవ్రమైన మానసిక కల్లోలంతో బాటు హఠాత్పరిణా మాలకు ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడంలో ఇబ్బందికి దారితీస్తుంది. బీపీడీ ఉన్న వ్యక్తులు తరచుగా వారిని గురించి వారు న్యూనతా భావానికి లోనవుతూ తమనెవరూ పట్టించుకోరు అనే భయాన్ని నిరంతరం అనుభవిస్తారు. 

ఇది కూడా చదవండి.. ఎలాంటి రోగాలకు యునాని ఉపయోగపడుతుంది..?  

ఆత్మహత్య చేసుకోవాలనే..

ఈ సవాళ్లు వారికి వారే హాని చేసుకోవడం లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు దారితీస్తాయి. బీపీడీ ఖచ్చితమైన కారణం కనుగొనబడనప్పటికీ పరిశోధన అనారోగ్యానికీ,బాల్యంలో కలిగిన గాయాలకూ మధ్యన ఉండే బలమైన సంబంధాన్ని సూచిస్తుందని ప్రాణ్ వెల్‌నెస్ క్లినికల్ సైకాలజిస్ట్ ధర్నా చతుర్వేది చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి.. ఎలాంటి రోగాలకు యునాని ఉపయోగపడుతుంది..?  

 మనసుకు కలిగే గాయాల విషయంలో.. 

బాల్యంలో మనసుకు కలిగే గాయం అనేది పిల్లల భావోద్వేగ, మానసిక సంక్షేమంపై శాశ్వత ప్రభావాలను విడిచిపెట్టే వివిధ ప్రతికూల అనుభవాలతో కూడి ఉంటుంది. ఈ అనుభవాలలో నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం, శారీరక వేధింపులు, లైంగిక వేధింపులు, భావోద్వేగాలను దుర్వినియోగ పరచడం, ఇంటిలో హింసను చూడడం లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఉండడం వంటివి కావచ్చు. ఈ సంఘటనలు పిల్లలకి అసురక్షితను, అభద్రతను, వారి గురించి, వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయి. 

 మనసుకు కలిగే గాయాలకూ బీపీడీకీ మధ్య సంబంధం..? 

బాల్యంలో కలిగే గాయానికీ మరియు బీపీడీకీ మధ్య గట్టి సంబంధమే ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బీపీడీతో బాధపడుతున్న వ్యక్తులు వారి, భావోద్వేగాలను ఎవరూ పట్టించుకోలేదనీ ఇంకా వివిధ రకాల తప్పుడు ప్రవర్తనల వంటి బాధాకరమైన బాల్య అనుభవాల చరిత్రను కలిగి ఉండే అవకాశం ఉంది.

 చిన్ననాటి గాయం పిల్లలలో ఆరోగ్యకరమైన జీవించగలిగే నేర్పు  అభివృద్ధికి అంతరాయం కలిగిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. బాధాకరమైన సంఘటనను ఎదుర్కొన్నప్పుడు, పిల్లలు ఓదార్పును, మద్దతును, ఆ అనుభవాన్ని ఎలా అర్ధం చేసుకోవాలనే దాని గురించిన మార్గదర్శకత్వాన్ని వారి సంరక్షకుల నుంచి ఆశిస్తారు.

అయినప్పటికీ, సంరక్షకులు ఒక వేళ అందుబాటులో లేనప్పుడు, తప్పుడు ప్రవర్తనకీ లేదా నిర్లక్ష్యానికీ గురయితే, పిల్లవాడు అలాంటి కఠినమైన భావోద్వేగాలను తట్టుకోవడానికి అనారోగ్యకరమైన మార్గాల వెంట పడవచ్చు. ఈ దుర్వినియోగకరమైన అధ్యయనం అనేదివారికి యుక్తవయస్సు వచ్చే వరకు కొనసాగుతుంది. ఇది చివరకు బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ పెరగడానికి దోహదం చేస్తుంది.

ఇది కూడా చదవండి.. మండుటెండల్లో చల్లగా ఉంచే సమ్మర్ హెల్తీ డ్రింక్.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health mental-tensions mental-problems effect-mind mental-issues stress-mind effect borderline-personality-disorder childhood mental-stress mental-illness bpd
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com