Vitamin D Deficiency : నడుం నొప్పితో బాధపడుతున్నారా..? విటమిన్-డి లోపమే కారణం లేటెస్ట్ స్టడీలో వెల్లడి..!
సాక్షి లైఫ్ : ప్రజెంట్ జనరేషన్ లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య 'దీర్ఘకాలిక నడుం నొప్పి' (Chronic Low Back Pain). అయితే, ఈ నొప్పికి కేవలం కూర్చునే పద్ధతి లేదా శ్రమ మాత్రమే కారణం కాదని, శరీరంలో విటమిన్-డి లోపం కూడా ఒక ముఖ్య కారణమని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆసుపత్రి నిర్వహించిన తాజా అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
పరిశోధనలో తేలిన ముఖ్యాంశాలు..
సుమారు 12 వారాలకు పైగా నడుము నొప్పితో బాధపడుతున్న రోగులపై ఈ పరిశోధన సాగింది. ఇందులో పాల్గొన్న వారిలో మెజారిటీ వ్యక్తులు 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు కావడం గమనార్హం.నడుము నొప్పితో బాధపడే వారిలో అత్యధికులకు విటమిన్-డి స్థాయిలు సాధారణం కంటే చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. శరీరంలో విటమిన్-డి ఎంత తక్కువగా ఉంటే, నడుము నొప్పి తీవ్రత అంత ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. విటమిన్-డి లోపం ఉన్నవారిలో దైనందిన పనులు చేసుకోవడం కూడా భారంగా మారుతోందని, వారు త్వరగా అలసిపోవడమే కాకుండా శారీరక వైకల్యానికి (Functional Disability) గురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు.
ఎందుకీ విటమిన్-డి లోపం..?
భారతదేశం వంటి సూర్యరశ్మి పుష్కలంగా ఉండే దేశాల్లో కూడా 50శాతం నుంచి 95శాతం మంది ఈ లోపంతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు..
ఎండ తగలని గదుల్లో ఎక్కువ సమయం గడపడం.
పోషకాహార లోపం.
మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం.
నడుము నొప్పిని కేవలం పెయిన్ కిల్లర్లతో తగ్గించుకోవాలని చూడకండి. రక్త పరీక్ష ద్వారా విటమిన్-డి స్థాయిలను తనిఖీ చేయించుకోవడం అవసరం. అవసరమైతే వైద్యుల సలహా మేరకు విటమిన్-డి సప్లిమెంట్లు వాడటం వల్ల నొప్పి తీవ్రతను తగ్గించడమే కాకుండా, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు," అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
