Changes in BP Treatment Guidelines : బిపి చికిత్స నిబంధనల్లో మార్పులు.. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ న్యూ గైడ్ లైన్స్ 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రక్తపోటు నియంత్రణకు సంబంధించి అంతర్జాతీయ మార్గదర్శకాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 2025లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (American Heart Association) విడుదల చేసిన నూతన నిబంధనల ప్రకారం, 'స్టేజ్-1' రక్తపోటు ఉన్న వారిలో చికిత్సకు అర్హులయ్యే వారి సంఖ్య భారీగా పెరగనుంది. గతంలో 57 శాతంగా ఉన్న ఈ అర్హత, తాజా మార్పులతో 73 శాతానికి చేరింది. దీనివల్ల ప్రాథమిక దశలో ఉన్న బిపి రోగులకు ముందస్తుగా వైద్యం అందించి, భవిష్యత్తులో వచ్చే గుండెపోటు, పక్షవాతం వంటి ముప్పులను అరికట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

 

ఏమిటీ మార్పు..?

సాధారణంగా రక్తపోటు 130–139/80–89 mm Hg మధ్య ఉంటే దానిని 'స్టేజ్-1' హైపర్ టెన్షన్ అంటారు. పాత పద్ధతి (2017)..గతంలో పదేళ్ల కాలంలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు 10శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే మందులు సూచించేవారు. కొత్త పద్ధతి (2025)..తాజా సమీకరణాల ప్రకారం, ఈ ముప్పు 7.5 శాతానికి తగ్గించారు. అంటే తక్కువ రిస్క్ ఉన్న వారికి కూడా ఇప్పుడు చికిత్స అవసరమని గుర్తించారు.

గణాంకాలు ఏం చెబుతున్నాయి మరి..?

సుమారు 10 లక్షల మందిపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త నిబంధనల వల్ల అదనంగా 22 శాతం మంది స్టేజ్-1 బిపి రోగులు చికిత్స పరిధిలోకి వచ్చారు. విచిత్రంగా, పాత నిబంధనల ప్రకారం అర్హులైన 6 శాతం మంది కొత్త నిబంధనల ప్రకారం అనర్హులయ్యారు. వీరిలో 75శాతం మంది మహిళలు, 64శాతం మంది 70 ఏళ్లు పైబడిన వారు ఉండటం గమనార్హం. వివిధ జాతుల మధ్య ఈ వ్యత్యాసాలు తక్కువగానే ఉన్నప్పటికీ, వయసు, లింగ భేదాలు చికిత్స అర్హతపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయి.

ఈ మార్పుఎందుకు అంటే..?

గతంలో వాడిన గణన పద్ధతుల కంటే 'PREVENT' సమీకరణాలు మరింత ఖచ్చితంగా రిస్క్‌ను అంచనా వేస్తున్నాయి. "ప్రివెంట్" అనేది గుండె జబ్బుల ప్రమాదాన్ని లెక్కించే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కాలిక్యులేటర్ వంటి నిర్దిష్ట సాధనాలకు సంక్షిప్త రూపం. దీనివల్ల అనవసరమైన మందుల వాడకం తగ్గడమే కాకుండా, నిజంగా ముప్పు పొంచి ఉన్న వారికి సకాలంలో వైద్యం అందుతుంది. బిపి రీడింగ్ 130/80 కంటే ఎక్కువగా ఉంటే, అది సాధారణమేనని నిర్లక్ష్యం చేయవద్దు. మారుతున్న నిబంధనల దృష్ట్యా, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు అవసరమో లేదో డాక్టరును సంప్రదించి నిర్ణయించుకోవాలి.

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.