Dehydration : డీహైడ్రేషన్.. గుండెకు ప్రమాదకరమా..?

షేర్ చేయండి:
Dehydration : డీహైడ్రేషన్.. గుండెకు ప్రమాదకరమా..?

సాక్షి లైఫ్ : భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చిలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వాతావరణ మార్పులు కేవలం అసౌకర్యానికే కాదు.. గుండె ఆరోగ్యానికి కూడా పెను సవాలుగా మారుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో అధికంగా చెమట పట్టడం, రక్తపోటు (BP) తగ్గడం ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉందని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 

డీహైడ్రేషన్.. గుండెకు గండం..!

సాధారణంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు శరీరాన్ని చల్లబరచడానికి రక్త నాళాలు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో చెమట ఎక్కువగా పడుతుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గి 'డీహైడ్రేషన్' ఏర్పడుతుంది. ఫలితంగా రక్తపోటు సాధారణ స్థాయి కంటే గణనీయంగా పడిపోతుంది. బీపీ తగ్గడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే (blood Clots) ప్రమాదం ఉంది. దీనివల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడానికి అదనంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ ఒత్తిడి ఒక్కోసారి గుండెపోటు లేదా పక్షవాతానికి దారితీయవచ్చు.

ఏసీ వాడకంలో జాగ్రత్త.. 

వేసవి రాగానే చాలామంది ఏసీలను అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచుతారు. అయితే, బీపీ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఏసీని ఎప్పుడూ 24 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉంచడం ఉత్తమం. అతి చల్లదనం వల్ల దాహం వేయదు. దీనివల్ల తెలియ కుండానే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. చెమట పట్టకపోవడం వల్ల శరీరంలోని సోడియం బయటకు వెళ్లకుండా లోపలే నిలిచిపోతుంది. ఇది గుండె రోగులకు చాలా ప్రమాదకరం.

బీపీ చెకింగ్..  

సాధారణంగా రక్తపోటు 120/80 ఉండాలి. శీతాకాలంలో బీపీ పెరిగే అవకాశం ఉండగా.. వేసవిలో తక్కువ బీపీ (లో బీపీ) సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వరుసగా కొన్ని రోజుల పాటు రీడింగ్స్‌లో మార్పులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా గుండె జబ్బుల కోసం మందులు వాడేవారు, డాక్టర్ సలహా లేకుండా మందుల మోతాదును మార్చకూడదని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ సూచిస్తున్నారు.

 నివారణా చర్యలు.. 

తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పొటాషియం ఉండే ఆహారం గుండెకు మేలు చేస్తుంది. బార్లీ, రాగి వంటి ముతక ధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతుండాలి. నిమ్మరసం, పుదీనా నీరు, ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవడం వల్ల శరీరంలో లవణాల సమతుల్యత దెబ్బతినదు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడం మంచిది. జంక్ ఫుడ్, మసాలాలు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం గుండెపై మరింత భారాన్ని పెంచుతాయి.

 అధిక రక్తపోటును 'సైలెంట్ కిల్లర్'గా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వేసవిలో సరైన జీవనశైలి, తగినంత విశ్రాంతి, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా గుండెను కాపాడుకోవాలని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.