Ultra-Processed Foods : అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తో గుండెపోటు ప్రమాదం.. తాజా అధ్యయనం..
సాక్షి లైఫ్ : మీరు చిప్స్, డోనట్స్, బిస్కెట్లు వంటి 'అల్ట్రా ప్రాసెస్డ్' ఆహార పదార్థాలను ఇష్టంగా తింటున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతుందని తాజా అధ్యయనం హెచ్చరి స్తోంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన 'JACC: అడ్వాన్సెస్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన, మనం రోజూ తినే ఆహారం మన గుండె ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తుందో వివరించింది.
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ముప్పు ఎంతంటే..?
పరిశోధకుల వివరాల ప్రకారం.. రోజుకు ఒకసారి మాత్రమే ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారితో పోలిస్తే, రోజుకు సుమారు తొమ్మిది సార్లు ఇటువంటి ఆహారం తీసుకునే వారిలో గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం 67 శాతం ఎక్కువగా ఉంది. హృదయ సంబంధిత వ్యాధుల వల్ల మరణించే ముప్పు కూడా వీరిలో అధికంగా ఉన్నట్లు తేలింది. మనం తీసుకునే శుద్ధిచేసిన ఆహారాల పరిమాణం పెరిగే కొద్దీ, అనారోగ్య సమస్యల తీవ్రత కూడా పెరుగుతూనే ఉందని పరిశోధనలో వెల్లడైంది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే..?
మనం ఇంట్లో వండుకునే సహజమైన ఆహారం కాకుండా, ఫ్యాక్టరీలలో రంగులు, రుచులు (Flavorants), చక్కెర, ఉప్పును అధికంగా కలిపి తయారు చేసే ఆహార పదార్థాలను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. ఉదాహరణకు ప్యాక్ చేసిన చిప్స్, కుక్కీలు, క్యాండీలు, తీపి పానీయాలు, కూల్ డ్రింక్స్,ఇన్‌స్టంట్ నూడుల్స్, ఫ్రోజన్ మీల్స్.
ఈ తరహా ఆహారపు అలవాట్లు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండ టంతో, అమెరికా వంటి దేశాలు ఇప్పటికే కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి. అధికంగా చక్కెర, ఉప్పు ఉండే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని అక్కడి ఆరోగ్య శాఖ ప్రజలను కోరుతోంది. మన దేశంలో కూడా ఇటువంటి ప్రాసెస్డ్ ఆహార వాడకం పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు తాజా పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన స్వచ్ఛమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్యాక్ చేసిన ఆహారం కొనే ముందు దానిపై ఉండే లేబుల్‌ను జాగ్రత్తగా గమనించడం మర్చిపోకండి.
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
