ఒంటరితనం ఆరోగ్యానికి ప్రమాదకరం..హెచ్చరించిన డబ్ల్యూహెచ్ఓ  

సాక్షి లైఫ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) ఒంటరితనంపై ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో ఒంటరితనం అనేది ఆరోగ్యానికి హానికరం అని, పలు రకాల తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని డబ్ల్యూ హెచ్ఓ వెల్లడించింది

డబ్ల్యూ హెచ్ ఓ ఇటీవలి 'అవర్ ఎపిడెమిక్ ఆఫ్ లోన్లీనెస్ అండ్  ఐసోలేషన్' పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఇది వ్యక్తిగత ,సామాజిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో ఒంటరితనం కారణంగా హార్ట్ ప్రాబ్లెమ్, డిప్రెషన్, ఆందోళనతోపాటు సడెన్ డెత్ తో ముడిపడి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

 ఒంటరితనం అనేది రోజుకు15 సిగరెట్లు తాగడం వల్ల కలిగే మరణానికి సమానమని, సామాజికంగా ఒంటరితనం ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా అనేక తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటాడని తెలిపింది. పాఠశాల, కళాశాల, కార్యాలయం లేదా ఉత్పాదకత , సమన్వయం అవసరమయ్యే ఏదైనా సంస్థలో లాగా, అటువంటి వ్యక్తులు తమను తాము తక్కువగా భావిస్తారని వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్ వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సామాజిక సంబంధాలపై సెమినార్‌ను నిర్వహిస్తుంది. ఇది ఒంటరితనం అనే వ్యాధిని పరిష్కరించడానికి చేపట్టిన మొదటి కార్యక్రమం. వరల్డ్ హెల్త్ ఆర్గనేజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. 

కో-ప్రెసిడెంట్ యుఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి అండ్ ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ యూత్ ఎన్వోయ్ చిడో ఎంపెంబా నేతృత్వంలో సామాజిక ఒంటరితనం, సమర్థవంతమైన పరిష్కారాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : loneliness
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com