Fibromyalgia : ఫైబ్రోమయాల్జియా లక్షణాలు ఎలా ఉంటాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలో నిరంతరం వేధించే నొప్పితో పాటు విపరీతమైన అలసట, నిద్రలేమి, మానసిక ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నారా..? ఈ లక్షణాల వెనుక ‘ఫైబ్రోమయాల్జియా’ అనే దీర్ఘకాలిక రుగ్మత ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడేవారిలో కనిపించే సాధారణ లక్షణాలు, జన్యుపరమైన లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఫైబ్రోమయాల్జియా ప్రధాన లక్షణాలు..? 

తీవ్రమైన అలసట, నిద్రలేమి..ఈ సమస్య బారిన పడినవారిలో కేవలం శరీర నొప్పులే కాకుండా తీవ్రమైన అలసట, ఎంత నిద్రపోయినా తీరని నిద్రలేమి వేధిస్తాయి. మానసిక సమస్యలు, ఏకాగ్రత లోపం.. నిరంతర నొప్పుల కారణంగా బాధితుల్లో ఆందోళన (Anxiety), డిప్రెషన్, చిన్న విషయాలపై కూడా ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. బ్రెయిన్ ఫాగ్ (Brain Fog)..చాలా మంది రోగులు జ్ఞాపకశక్తి మందగించడం, ఆలోచనా స్పష్టతను కోల్పోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్య పరిభాషలో దీనినే ‘బ్రెయిన్ ఫాగ్’ అని పిలుస్తారు.

 

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

అయితే, అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు ఉండవు. ఈ వ్యాధిని నిర్ధారించడానికి ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక రక్త పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల దీనిని గుర్తించడం వైద్యులకు కూడా ఒక సవాలుగా మారుతోంది.

హంటింగ్టన్ వ్యాధితో సంబంధం ఉందా..?

ఈ పరిశోధనలో అత్యంత బలమైన జన్యు సంబంధం.. 'హంటింగ్టన్ డిసీజ్' (Huntington's Disease) తో సంబంధం ఉన్న జన్యువు దగ్గర లభించింది. అయితే, దీనివల్ల ఫైబ్రోమయాల్జియా ఉన్నవారికి హంటింగ్టన్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరిగిందని అర్థం కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. కాగా, హంటింగ్టన్ అనేది మెదడుకు సంబంధించిన ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి.

భవిష్యత్తులో కొత్త చికిత్సలకు బాటలు..

ఫైబ్రోమయాల్జియా అనేది కేవలం ఒక మానసిక సమస్య మాత్రమే అనే పాత భావనకు ఈ తాజా అధ్యయనం ద్వారా స్పష్టమైన చెక్ పడింది. ఇదొక బలమైన జీవసంబంధమైన (Biological) రుగ్మత అని ఈ పరిశోధన నిరూపించింది. ఈ వ్యాధికి దారితీసే ఇతర కారకాలు ఇంకా పరిశోధన దశలో ఉన్నప్పటికీ.. ఈ జన్యుపరమైన ఆధారాలు భవిష్యత్తులో ఈ సమస్యకు సరికొత్త, అత్యుత్తమ చికిత్సలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.