Body Clock : శరీర గడియారం దెబ్బతింటే ఎలాంటి వ్యాధులు తలెత్తుతాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరంలో కంటికి కనిపించని ఒక వ్యవస్థ ఉంటుంది. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రలేవాలి, ఎప్పుడు ఆకలి వేయాలి, ఎప్పుడు చురుకుగా పనిచేయాలి అనేవన్నీ ఈ వ్యవస్థే నిర్ణయిస్తుంది. దీనినే 'జీవగడియారం' (Body Clock) లేదా 'సర్కాడియన్ రిథమ్' (Circadian Rhythm) అంటారు. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా ఈ గడియారం లయ తప్పితే, కేవలం నిద్రలేమి మాత్రమే కాకుండా తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

 

జీవగడియారం లయ ఎందుకు తప్పుతుంది..?

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోకపోవడం, ఇష్టమొచ్చిన సమయంలో నిద్రలేవడం. రాత్రిళ్లు నిద్రపోయే ముందు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు వాడటం. వీటి నుంచి వచ్చే 'బ్లూ లైట్' నిద్రకు ఉపక్రమించే సహజ ప్రక్రియను దెబ్బతీస్తుంది. నైట్ షిఫ్టుల్లో విధులు నిర్వర్తించడం, రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడం. పగటిపూట తగినంత సహజమైన సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం.

పొంచి ఉన్న అనారోగ్య ముప్పులు..

ఊబకాయం, మధుమేహం: జీవగడియారం దెబ్బతింటే శరీర జీవక్రియలు మందగిస్తాయి. దీనివల్ల టైప్-2 మధుమేహం, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శరీరానికి ఎన్ని గంటల నిద్ర అవసరమో, ఏ సమయంలో నిద్రపోతున్నామన్నది కూడా అంతే ముఖ్యం. నిద్రలేమి వల్ల రక్తపోటు పెరిగి గుండె జబ్బులకు దారితీస్తుంది.

మానసిక సమస్యలు..

నిద్ర విధానం దెబ్బతినడం వల్ల పగటిపూట తీవ్రమైన అలసట, చిరాకు, కుంగుబాటు (Depression) వంటి మూడ్ స్వింగ్స్ వస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వారాంతాల్లో లేదా సెలవు దినాల్లో కూడా ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. నిద్రలేచిన వెంటనే కాసేపు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఇది శరీరానికి 'పగలు' అయిందనే సంకేతాన్ని పంపి, జీవగడియారాన్ని రీసెట్ చేస్తుంది. పడుకునే ముందు గదిలో లైట్లు ఆర్పేయాలి లేదా కాంతి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. టీవీలు, ఫోన్లకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ భోజనం ఒకే సమయానికి తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో జీవగడియారం మెరుగు పడుతుంది.  

 

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.