ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి..?

సాక్షి లైఫ్ : ఎముకలు బలంగా ఉంచుకోవాలంటే.. ఆకుకూరలు, పలురకాల పండ్లు ,కాయలు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతారు. కానీ పురాతన కాలం నుంచి మన పెద్దలు ఎన్నోరకాల ఆరోగ్యకరమైన ఆహారాలను మనకు అందిస్తున్నారు. 

అటువంటి వాటిలో ఐవి చాలా కీలకమైనవి.. అవి మన ఎముకలను ధృడంగా ఉంచడంలో పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి..అవేంటో..? వాటిని ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

నువ్వుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. వీటితో తీపి వంట‌కాలు త‌యారు చేస్తారు. అలాగే ప‌చ్చ‌ళ్ల‌లో నువ్వుల పొడిని కూడా వేస్తుంటారు. అయితే నువ్వులు బాగా వేడి అని చాలా మందిఅపోహ పడతారు. 

నువ్వులు.. 
 
కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే.. రోజూ త‌గినంత నీటిని తాగితే నువ్వుల‌ను తిన్నా ఏమీ కాదు. వేడి చేయ‌దు. కాబట్టి నువ్వుల‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.

కాల్షియం.. 

 నువ్వుల్లో అనేక రకాల ఆరోగ్యప్ర‌యోజ‌నాలున్నాయి. నువ్వుల్లో పాల క‌న్నా 13 రెట్లు అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. క‌నుక ఇది మ‌న ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది. 100 గ్రాముల నువ్వుల‌లో 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 

పెద్ద‌ల‌కు రోజుకు 450 మిల్లీగ్రాములు, పిల్ల‌ల‌కు 600 మిల్లీగ్రాములు, గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లుల‌కు రోజుకు 900 మిల్లీగ్రాముల కాల్షియం అవ‌స‌రం. కాబట్టి నువ్వుల‌ను రోజూ గుప్పెడు మోతాదులో తింటే చాలు మ‌న‌కు కావ‌ల్సిన కాల్షియం మొత్తం ఒకేసారి ల‌భిస్తుంది. 

ఉండ‌లు..  

నువ్వుల‌ను రోజూ ఒక గుప్పెడు మోతాదులో వేయించి తిన‌వ‌చ్చు. అంతే మోతాదులో పొడిని కూర‌ల‌పై చ‌ల్లుకుని తీసుకోవ‌చ్చు. ఇక ఇలా కూడా తిన‌లేమ‌ని అనుకుంటే.. అందుకు ఇంకో మార్గం ఉంది. అదేమిటంటే.. నువ్వుల‌ను రోజూ తీసుకోవాలంటే.. వాటితో ఉండ‌లు త‌యారు చేసుకోవాలి. 

 నువ్వుల‌ను వేయించి వాటిలో బెల్లం పాకం క‌లిపి ఉండ‌లుగా త‌యారు చేసుకోవాలి. వీటిని రోజుకు ఒక్క‌టి తిన్నా చాలు.. మ‌న శ‌రీరానికి కావల్సిన కాల్షియం మొత్తం ల‌భిస్తుంది. అంతేకాదు ఎముక‌లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. 

ముఖ్యంగా నువ్వుల‌ను నేరుగా తినాల‌నుకుంటే వాటిని 7 నుంచి 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. నానబెట్టిన తర్వాత అవి మెత్త‌గా అవుతాయి. ఆ త‌రువాత వాటిని బాగా న‌మిలి తినాలి. వీటిని తినక ముందు, తిన్న గంట త‌రువాత వ‌ర‌కు వేరేవి ఏమీ తీసు కోకూడదు. 


అనేక పోష‌కాలు.. 
 
లేదంటే నువ్వులు స‌రిగ్గా జీర్ణం కావు. ఇలా నువ్వుల‌ను తీసుకుంటే చాలా సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. వీటితో అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. అలాగే అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. నువ్వుల‌ను ఇలా తీసుకోవడంద్వారా మ‌న‌కు అనేక ఆరోగ్య ప్రయోజ నాలు క‌లుగుతాయి. 

ముఖ్యంగా కొలెస్ట్రాల్‌, బీపీ త‌గ్గుతాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సినంత ఫైబ‌ర్ ల‌భిస్తుంది అంతేకాదు జీర్ణ స‌మ‌స్య‌లు తలెత్తవు. ప్ర‌ధానంగా మ‌ల‌బ‌ద్ద‌కసమస్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గుండెకు కూడా చాలా మంచిది. ఎముక‌లు దృఢంగా మారుతాయి. 

 అధిక ప్రోటీన్లు..  

వాపులు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. శ‌క్తి వ‌స్తుంది. నీర‌సం పోతుంది. కాబ‌ట్టి ఈ ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే తప్పనిసరిగా రోజుకో నువ్వుల ఉండ‌ తినండి.. ఆరోగ్యంగా ఉండండి.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

Tags : women-health
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com