సాక్షి లైఫ్ : నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు చదువు, (homework) హోంవర్క్, కోచింగ్ క్లాసుల (coaching classes) ఒత్తిడిలో (pressure of studies)మునిగిపోతున్నారు. అయితే, వారి మెదడు(brain), శరీరం ఆరోగ్యంగా ఎదగాలంటే, నిరంతరం పనికి బదులుగా సరైన విశ్రాంతి (Break) చాలా అవసరం. ప్రముఖ వైద్యనిపుణులు ఇదే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
పిల్లలకు 'బ్రేక్' ఎందుకు ముఖ్యం..?
మానసిక శక్తి పెరుగుతుంది (Boosts Mental Power)..చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల పిల్లల మెదడు రిలాక్స్ అవుతుంది. దీని ద్వారా వారు తిరిగి చదువుపై దృష్టి పెట్టడానికి, విషయాలను త్వరగా అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఒత్తిడి తగ్గుతుంది (Reduces Stress)..చదువు లేదా ఆటల నుంచి కాసేపు విరామం తీసుకోవడం వల్ల వారిలో పేరుకుపోయిన ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. పిల్లలు మరింత ప్రశాంతంగా, సంతోషంగా ఉండడానికి వీలుకలుగుతుంది.
సృజనాత్మకత అభివృద్ధి (Develops Creativity): విశ్రాంతి సమయంలో పిల్లలు పుస్తకాలు, స్క్రీన్లకు దూరంగా ఉండి, తమకు నచ్చిన ఆటలు ఆడటం లేదా ప్రకృతిలో గడపడం వంటివి చేస్తే... వారిలోని సృజనాత్మక ఆలోచనలు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు పెరుగుతాయి.
శారీరక ఆరోగ్యం (Physical Health): బ్రేక్‌లో కాసేపు ఆరుబయట ఆడటం లేదా చురుగ్గా ఉండటం వల్ల వారి శారీరక శక్తి పెరుగుతుంది, కండరాలు దృఢంగా తయారవుతాయి. ఇది నిశ్చల జీవనశైలి (Sedentary Lifestyle) వల్ల వచ్చే ఊబకాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది. తల్లిదండ్రులతో అనుబంధం.. బ్రేక్ సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో కలిసి నాణ్యమైన సమయం గడపడం (Quality Time) ద్వారా వారి మధ్య బంధం బలపడుతుంది.
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com