బీపీడీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
సాక్షి లైఫ్ : బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ Borderline personality disorder (బీపీడీ) అనేది ఒక వ్యక్తి భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యాన్ని దెబ్బతీసే మానసిక అనారోగ్యం. ఇది తీవ్రమైన మానసిక కల్లోలంతో పాటు హఠాన్ పరిణామాలకు ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడంలో ఇబ్బందికి దారితీస్తుంది. బీపీడీ ఉన్న వ్యక్తులు తరచుగా వారిని గురించి వారు న్యూనతా భావానికి లోనవుతూ తమనెవరూ పట్టించుకోరు అనే భయాన్ని నిరంతరం అనుభవిస్తారు.
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఆత్మహత్య చేసుకోవాలనే..
ఈ సవాళ్లు వారికి వారే హాని చేసుకోవడం లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు దారితీస్తాయి. (Borderline personality disorder) బీపీడీ ఖచ్చితమైన కారణం కనుగొనబడనప్పటికీ పరిశోధన అనారోగ్యానికీ,బాల్యంలో కలిగిన గాయాలకూ మధ్యన ఉండే బలమైన సంబంధాన్ని సూచిస్తుందని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు.
భావోద్వేగ, మానసిక సంక్షేమంపై..
బాల్యంలో మనసుకు కలిగే గాయం అనేది పిల్లల భావోద్వేగ, మానసిక సంక్షేమంపై శాశ్వత ప్రభావాలను విడిచిపెట్టే వివిధ ప్రతికూల అనుభవాలతో కూడి ఉంటుంది. ఈ అనుభవాలలో నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం, శారీరక వేధింపులు, లైంగిక వేధింపులు, భావోద్వేగాలను దుర్వినియోగ పరచడం, ఇంటిలో హింసను చూడడం లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఉండడం వంటివి కావచ్చు. ఈ సంఘటనలు పిల్లలకి అసురక్షితను, అభద్రతను, వారి గురించి, వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
