విద్యా రంగంలో ఏఐ : చిన్నారులపై ఏలాంటి ప్రభావం పడుతుంది..?  

సాక్షి లైఫ్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) (Artificial Intelligence) అనేది రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది. సాధారణ విషయాల నుంచి ప్రోగ్రామింగ్ (programming) వంటి అధునాతన సమస్యల పరిష్కారాల వరకు ఇది సహాయ పడుతుంది. విద్యారంగంలో ఏఐ అత్యంత ఆశాజనకంగా ఉన్న రంగాల్లో ఒకటి. ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియలు, బోధనలో (administrative processes and teaching) ఉపయోగపడుతుంది. అయితే, ఏఐ ఒక సహాయక సాధనంగా ఉండాలంటే, విద్యార్థులు(students) దీనిపై పూర్తిగా ఆధారపడకుండా, వారిని శక్తివంతం చేసేలా దీనిని జాగ్రత్తగా ఉపయోగించాలి.

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

బోధన(teaching partner) ఏఐ.. 

విద్యరంగంలో, ఏఐ కేవలం ఒక సాధనం మాత్రమే కాదు, అది ఒక అభ్యాస సహాయకుడిగా (learning assistant)మారుతోంది. ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేదు, వారికి మరింత మెరుగైన, అందుబాటులో ఉండే బోధనను అందించడంలో సహాయపడవచ్చు. అయితే, ఉపాధ్యాయులు ఈ వ్యవస్థలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడమే కాకుండా, వాటి నైతిక, సామాజిక చిక్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. 

ఏఐ ప్రతి విద్యార్థి (student) అవసరాలకు అనుగుణంగా పాఠాలను మార్చడానికి, సమానత్వాన్ని నిర్ధారించడానికి, చాలామంది విద్యార్థులు కోల్పోయే జ్ఞానానికి ప్రాప్యతను అందిస్తుంది. ఇది కంటెంట్‌ను నిర్వహించడం, సమాచారాన్ని క్రోడీకరించడం, పాఠాలను ప్రణాళిక చేయడం వంటి పనులను కూడా సులభతరం చేస్తుంది.

రెండు వైపుల పదును ఉన్న కత్తి.. 

 ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఏఐతో (risks with AI)కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కష్టమైజ్డ్ లెర్నింగ్ తో పాటు, దుర్విని యోగం, ఎక్కువగా ఆధారపడటం, నైతిక సమస్యల వంటివి దీనితో ముడిపడి ఉన్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విధాన రూపకర్తలు దీని గురించి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఏఐ విద్యా విలువను పెంచడానికి అవకాశం ఉంటుంది.

విద్యలో ఏఐ ప్రయోజనాలు..  

లెర్నింగ్ ప్రాసెస్ (Learning process) : ఏఐ వ్యక్తిగత అభ్యాస వేగం, ప్రాధాన్యతలకు అనుగుణంగా పాఠాలను మార్చగలదు. ఇది జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం, ప్రేరణను పెంచుతుంది. మెరుగైన విద్యా ఫలితాలు: విద్యార్థులు ఏఐ టూల్స్ ద్వారా సేవలను పొందవచ్చు. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అండుకోవడానికి వీలుంటుంది.

ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ సిస్టమ్స్(Intelligent tutoring systems) వ్యక్తిగత మద్దతు, అభ్యాసంలో స్వయంప్రతిపత్తి, తక్షణ అభిప్రాయం ద్వారా చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రయోజనాలు : విశాలమైన వనరులకు అవకాశం, విశ్లేషణ, కమ్యూనికేషన్(communication), టీమ్‌వర్క్ వంటి ఉన్నత-స్థాయి నైపుణ్యాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. భవిష్యత్తులో, ఏఐ అక్షరాస్యత కూడా ఒక ముఖ్యమైన నైపుణ్యంగా మారే అవకాశం ఉంది.

నష్టాలు, సవాళ్లు (Disadvantages, challenges).. 

ఎక్కువగా ఆధారపడటం: విద్యార్థులు ప్రతిదానికీ ఏఐపై ఆధారపడితే, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, స్వతంత్ర సమస్య పరిష్కారం వంటివి బలహీనపడవచ్చు.

ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదు: ఏఐ డేటా ప్రాసెసింగ్‌లో బలంగా ఉంటుంది కానీ, మద్దతు, తీర్పు, భావోద్వేగ అవగాహన విషయంలో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ విద్యలో మానవ పాత్రకు ప్రాముఖ్యత ఏ మాత్రం తగ్గదు. 

సామాజిక ఒంటరితనం (Social isolation): నేర్చుకోవడం అనేది ఒక సామాజిక ప్రక్రియ. క్లాస్‌రూమ్(classroom)తో సంబంధం లేకుండా ఏఐను ఎక్కువగా ఉపయోగిస్తే, కమ్యూనికేషన్(communication), సహకారం (collaboration), మద్దతు(support) తగ్గుతుంది.

నైతిక, పక్షపాత సమస్య (Ethical and bias issues) : ఏఐ వ్యవస్థలు వాటికి శిక్షణ ఇచ్చిన డేటా విశ్లేషణలో ఖచ్చితత్వం లేకపోవచ్చు. ఇది సరైన ఫలితాలు చూపించక దాపోవచ్చు. గోప్యత సమస్యలుగా ఉంటాయి.

ఉపాధ్యాయుల బోధన (Teacher teaching)..  

ఉపాధ్యాయుల(Teacher)బోధనకు పూర్తి ప్రత్యామ్నాయంగా కాకుండా, ఏఐ ని ఒక సహాయక వ్యవస్థగా చూడాలి. సరైన శిక్షణ, నైతిక చట్రాలతో, ఏఐ (improving education) విద్యను మెరుగుపరిచే ఒక సహాయక భాగస్వామిగా పనిచేస్తుంది. విద్యార్థులు(Students), ఉపాధ్యాయులు((Teachers), విధాన రూపకర్తలు, తల్లిదండ్రులు అందరూ కలిసి పనిచేసి, భవిష్యత్తు(future) కోసం ఏఐని (responsibly)బాధ్యతాయుతంగా, ప్రభావవంతంగా ఉపయోగించాలి.

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : psychological-phenomena psychological-effects predictive-ai medical-ai ai-in-education psychological-impact-of-ai-on-children benefits-and-drawbacks-of-ai-in-learning ai-and-child-development personalized-learning-with-ai ai-literacy-for-kids
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com