3 Key Elements : రోగాల బారిన పడకుండా ఉండాలంటే..ఈ 3 పక్కా..!
సాక్షి లైఫ్ : వాతావరణంలో మార్పులు వస్తున్న ప్రతిసారీ, అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాధి నిరోధక శక్తి (Immunity)ని పెంచుకోవడం చాలా అవసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహారం, వ్యాయామం, విశ్రాంతి (నిద్ర) అనే మూడు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఆరోగ్యానికి 3 ముఖ్య సూత్రాలు..
సరైన ఆహారం (Diet).. జంక్‌ఫుడ్‌కు పూర్తిగా మానేయాలి..మారుతున్న వాతావరణంలో రోగ నిరోధక శక్తిని తగ్గించే జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. వీటి వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది.
ఇమ్యూనిటీ బూస్టర్లు అవసరం.. తాజా పండ్లు, కూరగాయలు, నిమ్మ, ఉసిరి వంటి విటమిన్ "సి" అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. వేడిగా ఉండే సూప్‌లు, హెర్బల్ టీలు (అల్లం, తులసి) ఈ సమయంలో ఎంతో మేలు చేస్తాయి.
వ్యాయామం (Exercise)..ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం లేదా నడక, యోగా వంటివి చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. శారీరక శ్రమ రక్త ప్రసరణను మెరుగుపరిచి, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
తగినంత విశ్రాంతి (Rest)..శరీరం రికవరీ కావడానికి, కొత్త శక్తిని పొందడానికి ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరి.
నిద్ర సరిగా లేకపోతే ఇమ్యూనిటీ పడిపోయి, త్వరగా అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది.
వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యలను తేలికగా తీసుకోకుండా, ఈ మూడు ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
