నీరు తాగడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్..
సాక్షి లైఫ్ : నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. నీరు పుష్కలంగా తాగడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులు నయం అవుతాయి. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో నిర్విషీకరణ జరగడం ద్వారా చర్మం మెరుగుపడుతుంది. చర్మం రంగును మెరుగుపరచడానికి , శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజూ ఎంత నీరు తాగాలి..? అనే దాని గురించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతారు. కానీ ఎక్కువ నీరు తాగడం కూడా శరీరానికి హానికరమేనట. కాబట్టి ఖచ్చితంగా రోజులో ఎంత నీరు తాగాలి..? నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
నీరు తాగడం వల్ల..
శరీర బరువులో 50 నుంచి 70 శాతం నీరు ఉంటుంది. నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉండడడమేకాకుండా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మంలో తేమను కాపాడుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుష్కలంగా నీరు తాగాలి. నీరు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది ఆరోగ్య సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుంది. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. నీటి కొరత వల్ల కణాల్లోని ద్రవాలు పోయి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
నీరు ఎంత తాగాలి..?
వ్యక్తికి వ్యక్తికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వైద్య పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందువల్ల, ప్రతి వ్యక్తికి నీటి అవసరాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఏసీలో కూర్చునే వ్యక్తి కంటే ఎక్కువసేపు ఎండలో నడిచే వ్యక్తికి ఎక్కువ నీరు అవసరం. కాబట్టి ప్రతి వ్యక్తి వారి శారీరక స్థితిని,అక్కడి వాతావరణాన్ని బట్టి ఎంత నీరు తాగాలో నిర్ణయించుకోవాలి. పురుషులు రోజుకు 3.7 లీటర్లు, స్త్రీలు 2.7 లీటర్ల నీరు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?
ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
