ప్రతిరోజూ 10 నిమిషాలు సైకిల్ తొక్కడం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
సాక్షి లైఫ్ : నేటి బిజీ బిజీ లైఫ్ లో అనేకమార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మారిన జీవనశైలి కారణంగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దినచర్యలో కొంతసేపు శారీరక శ్రమ చేయడం చాలా ప్రధానం. అందుకోసం క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ పది నిమిషాలు సైక్లింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. మనం తీసుకునే ఆహారం మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి.. Thyroid problems : థైరాయిడ్ సమస్యకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పు మధుమేహాన్ని నియంత్రిస్తుందా..?
ఇది కూడా చదవండి.. హై గ్రేడ్ ఫీవర్ అంటే..?
సైక్లింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
సైక్లింగ్ అనేది ఒక రకమైన ఏరోబిక్ వ్యాయామం. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.చాలా మంది పిల్లలు తమ బాల్యంలో సైకిల్ తొక్కుతారు. అయితే పెద్దయ్యాక ఈ అలవాటు చాలా మందిలోపోతుంది. నేటి జీవనవిధానంలో అందరూ బిజీ బిజీగా మారారు, వారికి సైకిల్ తొక్కడానికి కూడా సమయం దొరకడం లేదు. ఎలక్ట్రిక్ సైకిళ్ళు, స్కూటర్లు లేదా కార్లు మాత్రమే నడుపుతున్నారు. దీని కారణంగా శరీరానికి తగిన శ్రమ కలిగించడం లేదు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతి రోజూ ఉదయం నడక, జాగింగ్ లేదా సైకిల్ తొక్కడం మంచిది అని అంటున్నారు వైద్యనిపుణులు.
సైక్లింగ్ తర్వాత. ఒక వారంలోనే మీ ఆరోగ్యంలో చాలా మార్పులు కనిపిస్తాయి.
గుండె ఆరోగ్యం..
సైక్లింగ్ గుండె కండరాలను బలపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
బరువు తగ్గడంలో..
మీరు బరువు తగ్గాలని అనుకుంటే ఖచ్చితంగా సైకిల్ తొక్కాలి. మీరు ప్రతిరోజూ 10 నిమిషాలు సైక్లింగ్ చేస్తే కేలరీలను బర్న్ చేస్తుంది. తద్వారా జీవక్రియ వేగవంతం అవుతుంది.
ఒత్తిడిని తగ్గించడంలో..
సైక్లింగ్ వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడి ,ఆందోళనను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పొద్దున్నే సైక్లింగ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండడానికి వీలుకలుగుతుంది.
ఊపిరితిత్తులకు..
మీరు సైకిల్ తొక్కేటప్పుడు, మీ శ్వాస సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించి శరీరానికి సరిగ్గా అందించడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తికి..
మీరు ప్రతిరోజూ సైకిల్ తొక్కితే, అది శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
సైక్లింగ్ వల్ల కాలుష్య స్థాయి కూడా తగ్గుతుంది. తక్కువ దూరం సైకిల్‌పై ప్రయాణించడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
నిద్ర నాణ్యత..
మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, మీరు రోజూ సైకిల్ తొక్కడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. ఇది నిద్రలేమి సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
