లెమన్‌గ్రాస్ హెర్బల్ టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. 

షేర్ చేయండి:
లెమన్‌గ్రాస్ హెర్బల్ టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. 

సాక్షి లైఫ్ : లెమన్ గ్రాస్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఈ ఆకుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వర్షాకాలంలో దానితో తయారు చేసిన హెర్బల్ టీ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుకోవచ్చు. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. లెమన్ గ్రాస్ తో చేసిన టీ తాగడంవల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

డిటాక్సిఫై.. 


ఉదయం లేవగానే లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. అంతేకాదు లెమన్ గ్రాస్ హెర్బల్ టీ తీసుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం, లవంగం, యాలకులు, నిమ్మకాయ రసం కలిపి లెమన్ గ్రాస్ టీ తయారు చేస్తారు.

లెమన్‌గ్రాస్ హెర్బల్ టీ.. 

లెమన్ గ్రాస్‌లో చాలా ముఖ్యమైన పోషకాలున్నాయి. ఇందులో కాల్షియం, జింక్, ఐరన్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఏ , పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తికి సంబంధించిన ఏదైనా చిన్న సమస్య అయినా, ఉదయాన్నే లెమన్ గ్రాస్ హెర్బల్ టీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. 

ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే.. 

ఇది కూడా చదవండి.. పిల్లలలో మయోపియా సమస్యకు ప్రధాన కారణాలు..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.