రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే.. 

షేర్ చేయండి:
రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే.. 

సాక్షి లైఫ్ : రాత్రి భోజనం చేసిన తర్వాత తరచుగా నిద్రపోతారు లేదా కూర్చుని టీవీ లేదా స్మార్ట్ ఫోన్ చూస్తారు. ఇలాంటి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. రాత్రి సమయంలో తిన్న తర్వాత నడవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..   
 
 మానసిక ఆరోగ్యంపై..
 
రాత్రి పూట భోజనం చేసిన వెంటనే పడుకుంటే తిన్నది జీర్ణం అవ్వడం చాలా కష్టం. ముఖ్యంగా చాలా మంది డిన్నర్ తర్వాత సోఫాలో పడుకుని మనకు ఇష్టమైన షోలు చూస్తారు. ఇది చాలా ఓదార్పునిచ్చినప్పటికీ, ఆహారం మాత్రం తొందరగా జీర్ణం కాదు. అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత కొంత సేపు నడవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

  రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
 
రాత్రి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల గుండెల్లో మంట ,జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు   డైవర్టిక్యులర్ వ్యాధి నుంచి మలబద్ధకం, కొలొరెక్టల్ క్యాన్సర్ వరకు అన్నింటినీ నిరోధించడంలో సహాయపడుతుంది.  

కేలరీలను బర్న్ చేస్తుంది.. 

చాలా మందికి, విందు అనేది సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. కానీ రాత్రిపూట డిన్నర్ లో అధిక కేలరీల తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి భోజనం తర్వాత నడక ఈ విషయంలో మీకు సహాయపడుతుంది. కేలరీలను బర్న్ చేయడానికి ఇది మంచి మార్గమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

 
ఒత్తిడిని తగ్గిస్తుంది.. 

రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల శరీర ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంలా పనిచేస్తుంది. రోజువారీ ఒత్తిడిని నడకతో అధిగమించవచ్చు.   

నిద్రను మెరుగుపరుస్తుంది.. 

శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి భోజనం తర్వాత కచ్చితంగా నడవాలి. రాత్రి భోజనం తర్వాత నడవడం సిర్కాడియన్ లయలను నియంత్రించడంలో సహాయపడుతుంది.   శరీరాన్ని విశ్రాంతి, నిద్ర కోసం సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.

గుండెకు మంచిది..  

రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని కారణంగా రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.