Anorexia Nervosa: అందంగా కనిపించాలనే భయం.. ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది..!

షేర్ చేయండి:
Anorexia Nervosa: అందంగా కనిపించాలనే భయం.. ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది..!

సాక్షి లైఫ్ : సన్నగా, ఆకర్షణీయంగా కనిపించాలనే తాపత్రయం, పెరిగే బరువుపై భయం.. ఈ ఆలోచనలు ఎంత తీవ్రంగా మారుతున్నాయంటే, చివరికి అవి యువత ఆరోగ్యాన్ని నాశనం చేసే అనోరెక్సియా నెర్వోసా (Anorexia Nervosa) అనే మానసిక రుగ్మతకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇది కేవలం ఆహారం తీసుకోకపోవడం కాదు, ప్రాణాంతకం కాగల తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితి.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

 

అసలు అనోరెక్సియా నెర్వోసా అంటే ఏమిటి..?

అనోరెక్సియా నెర్వోసా అనేది ఒక 'ఈటింగ్ డిజార్డర్' (Eating Disorder). ఈ సమస్యతో బాధపడేవారు వాస్తవానికి చాలా తక్కువ బరువు ఉన్నప్పటికీ, తాము లావుగా ఉన్నామని బలంగా నమ్ముతారు. దీని వల్ల బరువు పెరుగుతామనే తీవ్రమైన, అహేతుక భయాన్ని కలిగి ఉంటారు.

తమ శరీర బరువు, ఆకృతి పట్ల వక్రీకరించిన అవగాహన (Distorted Body Image) ఉంటుంది. బరువు తగ్గడం కోసం కావాలనే ఆహారం, కేలరీలను అతిగా పరిమితం చేసుకుంటారు. కొందరు అతిగా వ్యాయామం చేయడం, లేదా బరువు పెరగకుండా ఉండేందుకు వాంతులు చేసుకోవడం, భేదిమందులు వాడటం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడతారు.

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.