Antibiotic Resistance : కంటిచూపునకు యాంటీబయోటిక్ నిరోధకత ముప్పు..శాస్త్రవేత్తల హెచ్చరిక

షేర్ చేయండి:
Antibiotic Resistance : కంటిచూపునకు యాంటీబయోటిక్ నిరోధకత ముప్పు..శాస్త్రవేత్తల హెచ్చరిక

సాక్షి లైఫ్ : సాధారణంగా కంటి శుక్లాల ఆపరేషన్ (Cataract Surgery) తర్వాత రోగులు త్వరగా కోలుకుంటారు. కానీ, ఇటీవలి కాలంలో 'యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్' (AMR) లేదా యాంటీబయోటిక్ మందులను తట్టుకునే బ్యాక్టీరియాల వల్ల ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతోందని హైదరాబాద్‌కు చెందిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (LVPEI) పరిశోధకులు వెల్లడించారు. ఈ నివేదిక ప్రముఖ జర్నల్ 'రెటినా' (Retina) లో ప్రచురితమైంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు కంటి చూపును శాశ్వతంగా దెబ్బతీసేలా పరిణామం చెందుతున్నాయని  ఈ అధ్యయనంలో తేలింది.

 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

అధ్యయనంలోని అంశాలు.. 

 ఆపరేషన్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లలో (endophthalmitis) దాదాపు 90 శాతం కేసులు బహుళ ఔషధ నిరోధకత (MDR) కలిగిన గ్రామ్-నెగటివ్ బాసిల్లి అనే ప్రమాదకర బ్యాక్టీరియా వల్లే వస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకిన రోగులలో 93 శాతం మంది కేవలం కాంతిని లేదా చేతి కదలికలను మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఈ సూపర్‌బగ్‌ల ధాటికి దాదాపు పది మందిలో ఒకరి కంటి చూపు పూర్తిగా క్షీణిస్తోంది. సాధారణంగా వాడే ఫ్లోరోక్వినోలోన్స్, అమీనోగ్లైకోసైడ్స్ వంటి మందులు ఈ బ్యాక్టీరియాపై పనిచేయడం లేదు. ప్రస్తుతం 'కొలిస్టిన్' అనే యాంటీబయోటిక్ మాత్రమే కొంతవరకు ప్రభావం చూపుతోంది.

కారణాలు ఏమిటి అంటే..?

అడ్డగోలుగా మందుల వాడడం చాలా ప్రమాదం. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో యాంటీబయోటిక్ కంటి చుక్కల మందులను (OTC) కొని వాడటం మరింత ముప్పు అని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఇన్ఫెక్షన్లు రాకుండా వాడే యాంటీబయోటిక్స్ వల్ల బ్యాక్టీరియాలు వాటిని తట్టుకునేలా రూపాంతరం చెందుతున్నాయి. కంటిలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సొంత వైద్యం కాకుండా, నిపుణులైన కంటి వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి.

 

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.