Fasting time : బీపీ, షుగర్ ఉందా..? ఉపవాసం ఉంటున్నారా..? ఐతే ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పండుగల సమయంలో మహిళలు రోజంతా ఉపవాసం ఉండటం సాధారణ ఆనవాయితీ. అయితే, థైరాయిడ్, మధుమేహం (diabetes), హై బీపీ లాంటి దీర్ఘకాలిక సమస్యలతో రోజూ మందులు వాడేవారు ఉపవాసం చేసేటప్పుడు ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా మందులు వాడేవారు ఉపవాసం సమయంలో పాటించాల్సిన నియమాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

వైద్యుల సలహా తప్పనిసరి..

 రోజూ ఉదయం లేదా సాయంత్రం మందులు వేసుకునే మహిళలు ఉపవాసం ఉండే ముందు కచ్చితంగా తమ డాక్టర్‌ను సంప్రదించాలి. సొంత నిర్ణయాలతో మందులు మానేయడం లేదా వేసుకునే సమయాన్ని మార్చడం ఆరోగ్యానికి ప్రమాదకరం.

మందుల వేళలు, నియమాలు..

 కొన్ని మందులు పరగడుపున, మరికొన్ని భోజనం తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు థైరాయిడ్ మందులు పరగడుపున వేసుకోవాలి. కానీ, ఆహారంతో పాటు తీసుకోవాల్సిన మందులను ఖాళీ కడుపుతో వేసుకుంటే కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీ మందుల స్వభావాన్ని బట్టి డాక్టర్ సలహాతో మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.

మధుమేహం, బీపీ రోగుల జాగ్రత్తలు..

 ఎక్కువ గంటలు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం (Hypoglycemia) లేదా పెరగడం జరగవచ్చు. ముఖ్యంగా ఇన్సులిన్ వాడే రోగులు ఆహారం తీసుకోకుండా మందులు వేసుకుంటే షుగర్ లెవల్స్ పడిపోయే ప్రమాదం ఉంది. బీపీ రోగులు సైతం మందులు మానకూడదు, తరచూ బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే.. ఉపవాస సమయంలో కళ్లు తిరగడం, వణుకు, చల్లటి చెమటలు పట్టడం, స్పృహ కోల్పోయినట్లు అనిపించడం లేదా విపరీతమైన నీరసం వంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తే.. వెంటనే ఉపవాసాన్ని విరమించి, డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.