Nutraceuticals: ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో న్యూట్రాస్యూటికల్స్ సేల్స్.. సీజ్ చేసిన అధికారులు..  

సాక్షి లైఫ్ : ప్రాణాలు కాపాడాల్సిన మందుల తయారీ విషయంలో కొన్ని ఫార్మా కంపెనీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. కఠినమైన ఔషధ నిబంధనల (Drug Rules) నుంచి తప్పించుకోవడానికి, మందులను 'న్యూట్రాస్యూటికల్స్' లేదా 'ఆహార పదార్థాల' (Food Products) పేరుతో విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడు తున్నాయి. గత ఆరు నెలల్లో తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (DCA) జరిపిన సోదాల్లో ఇలాంటి కనీసం తొమ్మిది ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

 

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

నిబంధనల నుంచి తప్పించుకునేందుకే..

సాధారణంగా ఒక ఔషధాన్ని తయారు చేయాలంటే డ్రగ్ లైసెన్స్ తీసుకోవాలి, కఠినమైన నాణ్యత పరీక్షలు (Quality Testing), క్రమం తప్పకుండా తనిఖీలు ఉంటాయి. అయితే, వీటిని ఫుడ్ లైసెన్స్ (Food Licence) కింద నమోదు చేయడం వల్ల నిబంధనలు సడలుతాయి, ఖర్చు తగ్గుతుంది, అనుమతులు త్వరగా వస్తాయి. ఈ లొసుగులను ఆసరాగా చేసుకుని కంపెనీలు ఈ అక్రమాలకు పాల్పడుతున్నాయి.

ఎక్కడెక్కడ.. ఏయే మందులు..?

మల్కాజ్‌గిరి, ఉప్పల్, ముషీరాబాద్, హబ్సిగూడ వంటి ప్రాంతాలతో పాటు ఢిల్లీకి చెందిన కంపెనీలు కూడా ఈ అక్రమాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అధికారులు సీజ్ చేసినవి ఇవే.. 

ఆస్టియో ఆర్థరైటిస్ మందులు, కాల్షియం-D3 ట్యాబ్లెట్లు, ఫోరాన్-XT, రిబోవిన్, ప్రోకాల్క్-జడ్ జింక్ డ్రాప్స్ వంటి వాటిని ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. వీటిలో ఫెర్రస్ ఆస్కార్బేట్, ఫోలిక్ యాసిడ్, జింక్ సల్ఫేట్, విటమిన్-D3 వంటి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (APIs) ఉన్నట్లు తేలింది.

రోగులకు ముప్పు.. 

నిబంధనలకు విరుద్ధంగా తయారయ్యే ఈ ఉత్పత్తుల వల్ల రోగులకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.డ్రగ్ రూల్స్ పాటించకపోవడం వల్ల నాణ్యత నియంత్రణ లోపించే అవకాశం ఉంది. మందులో ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా ఉండటం లేదా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. రక్తహీనత, ఎముకల బలహీనత వంటి వ్యాధుల కోసం వాడే ఈ మందులు సరైన నాణ్యతతో లేకపోతే చికిత్స ఫలించదు. దీనిపై స్పందించిన డీసీఏ అధికారులు.. సదరు కంపెనీలపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : vitamin-d-tablets healthy-foods nutrition-food essential-minerals new-rules drugs-fail-quality-test telangana-dca-alert
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com