Best Foods : 30 ఏళ్లు దాటాయా..? మీ డైట్‌లో ఇవి ఉండాల్సిందే..

షేర్ చేయండి:
Best Foods : 30 ఏళ్లు దాటాయా..? మీ డైట్‌లో ఇవి ఉండాల్సిందే..

సాక్షి లైఫ్ : వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ముప్పై ఏళ్లు దాటిన తర్వాత ఎముకల సాంద్రత క్రమంగా తగ్గుతూ వస్తుంది. చాలామంది ఎముకల బలం అంటే కేవలం పాలు తాగితే సరిపోతుందని అనుకుంటారు. కానీ, ఎముకలు ఉక్కులా ధృడంగా ఉండాలంటే పాలతో పాటు మరికొన్ని పోషకాలు శరీరానికి అత్యవసరం.

 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 

ఎముకల పటుత్వానికి ఉపయోగపడే సూపర్ ఫుడ్స్.. 


రాగులు (Ragi)..తృణధాన్యాలన్నింటిలోకెల్లా రాగుల్లో కాల్షియం అత్యధికం. ఇవి ఎముకల అరుగుదలను అరికడతాయి. ఆకుకూరలు.. తోటకూర, పాలకూర వంటి ముదురు ఆకుపచ్చ రంగు ఆకుకూరల్లో విటమిన్-కె, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. బాదంలో కాల్షియంతో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి కీలకం. నువ్వులు (Sesame Seeds)..ఒక్క స్పూన్ నువ్వులలో ఒక గ్లాసు పాలతో సమానమైన కాల్షియం ఉంటుంది.

చేపలు.. ముఖ్యంగా సార్డినెస్, సాల్మన్ వంటి చేపల్లో విటమిన్-డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. పాలు పడని వారు పెరుగు లేదా మజ్జిగ తీసుకోవచ్చు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ కాల్షియం శోషణను పెంచుతాయి. సోయా పాలు లేదా టోఫులో ఐసోఫ్లేవోన్లు ఉంటాయి, ఇవి ఎముకల సాంద్రతను కాపాడతాయి. విటమిన్-డి సహజంగా లభించే అతికొద్ది ఆహార పదార్థాల్లో గుడ్డు ఒకటి.

 నిమ్మ, నారింజ వంటి పండ్లలోని విటమిన్-సి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి ఎముకల ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. ఎండు ద్రాక్ష (Raisins)లో ఉండే 'బోరాన్' అనే ఖనిజం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జీవనశైలిలో ఈ మార్పులు కూడా తప్పనిసరి.. 
  
రోజూ ఉదయం 15-20 నిమిషాలు ఎండలో గడపడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్-డి అందుతుంది. వ్యాయామాలు నడక, రన్నింగ్ వంటివి ఎముకలను దృఢపరుస్తాయి. అధిక ఉప్పు, కెఫీన్ కాఫీ, టీ, ధూమపానం ఎముకల్లోని కాల్షియంను తగ్గించేస్తాయి.

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.