Diwali Festival Diet : దీపావళి పండుగ వేళ.. మధుమేహుల ఆహార నియమాలు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేవి నోరూరించే మిఠాయిలు, పిండివంటలే. పండుగ పూట బంధుమిత్రులతో కలిసి వీటిని ఆస్వాదించడం ఆనవాయితీ. కానీ, మధుమేహం (Diabetes) ఉన్నవారికి మాత్రం ఇది కాస్త సవాలే అని చెప్పాలి. తీపి పదార్థాలు, నూనెలో వేయించిన వంటకాలు రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. అలాగని పండుగ పూట ఏమీ తినకుండా ఉండలేరు. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు పండుగను ఆరోగ్యంగా ఎలా జరుపుకోవాలి..? ఎలాంటి పదార్థాలు తినాలో వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 

ఎలాంటి ఆహారం ఎంచుకోవాలి..?
 
మధుమేహం ఉన్నవారు పీచుపదార్థాలు (fiber), ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకుకూరలు, పప్పులు, సలాడ్లు, మొలకలు (Sprouts), తృణధాన్యాలు మీ ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను కూడా మితంగా తీసుకోవచ్చు.

స్వీట్లు తినొచ్చా..? లేదా..?

మధుమేహం ఉన్నవారు మిఠాయిలకు పూర్తిగా దూరం అవ్వాల్సిన అవసరం లేదు. కానీ, తినే మోతాదుపై నియంత్రణ (Portion control) చాలా ముఖ్యం. చక్కెర తక్కువగా వేసి, బాదం లేదా కొబ్బరితో చేసిన స్వీట్లను కొద్దిగా ఆస్వాదించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచు కోవాల్సిన విషయం ఏమిటంటే.. చక్కెరకు బదులుగా బెల్లం, తేనె, బ్రౌన్ షుగర్ వంటివి వాడినా కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి వాటిని వాడిన స్వీట్లను కూడా మితంగానే తీసుకోవాలి.

స్నాక్స్ విషయంలో..

పండుగ సమయంలో సమోసాలు, పకోడీలు, మిక్చర్ల వంటి నూనె పదార్థాలకు బదులుగా ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఎంచుకోవాలి. వేయించిన శనగలు, ఫూల్ మఖానా, స్ప్రౌట్స్ చాట్, పెసరట్టు, ఉప్పు లేని డ్రై ఫ్రూట్స్ తినడం ఉత్తమం. దీనివల్ల అనవసరమైన క్యాలరీలు శరీరంలోకి చేరకుండా ఉంటాయి.

వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..!

జిలేబీ, గులాబ్ జామున్ వంటి అధిక తీపి ఉండే మిఠాయిలు, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ పండ్ల రసాలు, నూనెలో బాగా వేయించిన (deep-fried foods) వంటకాలకు మధుమేహులు దూరంగా ఉండాలి. మైదా, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లతో చేసిన పదార్థాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలి.

చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే..?

భోజనం ఎప్పటికప్పుడు సమయానికి చేయాలి. ఎక్కువ సేపు కడుపు మాడ్చుకోకూడదు. పండుగ హడావిడిలో ఉన్నా సరే.. శరీరానికి సరిపడా నీళ్లు తాగడం మర్చిపోవద్దు. స్వీట్లు, స్నాక్స్ తినేటప్పుడు పరిమితి దాటకుండా మనసును అదుపులో ఉంచుకోవాలి.

ఇంట్లో గ్లూకోమీటర్ అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి.రోజూ వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేయడం మానొద్దు. వైద్యులు సూచించిన మందులు లేదా ఇన్సులిన్ సరైన సమయానికి వేసుకోవాలి.

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.