ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పారాసెటమాల్ వేసుకోకూడదా..?
సాక్షి లైఫ్ : ఆల్కహాల్ సేవించినపుడు మాత్రం పారాసెటమాల్ తీసుకుంటే దుష్ఫ్రభావాలు ఉంటాయి. ఆల్కహాల్‌లో ఇథనాల్ ఉంటుంది. ఈ ఇథనాల్ సమ్మేళనం పారాసెటమాల్‌తో ప్రతిచర్య జరుపుతుంది. దీని కారణంగా వికారం, వాంతులు, తలనొప్పి, మూర్ఛ, వంటివి సంభవించవచ్చు. రాత్రిపూట అతిగా మద్యం సేవించి ఆ ఉదయాన్నే కలిగే హ్యాంగోవర్‌ను వదిలించుకోవడం కోసం పారాసెటమాల్ తీసుకోవద్దు.
ఇది కూడా చదవండి.. పోషకాహారలోపం వల్ల ఎలాంటి నష్టాలున్నాయి..?
ఈ రెండింటి కలయికతో కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఒక్క పారాసెటమాల్ మాత్రమే కాదు, ఆల్కహాల్ వేసుకున్నప్పుడు మరేదైనా ఔషధం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆ ఔషధాలు కొనేటపుడు వాటితో ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో అడిగి తెలుసుకోవాలి. అంతేకాదు ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.
పారాసిటమాల్ తేలికపాటి మెడిసినే అయినప్పటికీ, మీరు దానిని మోతాదుకు మించి తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరి స్తున్నారు వైద్య నిపుణులు. కాబట్టి ఎలాటి సమయంలోనైనా సరే డాక్టర్ల సలహా మేరకే పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోవాలి.
ఇది కూడా చదవండి.. పారాసిటమాల్ సైడ్ ఎఫెక్ట్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
