ఎండా కాలంలో డ్రై ఫ్రూట్స్ తినకూడదా..?
సాక్షి లైఫ్ : ఎండాకాలం అయినా, చలికాలమైనా ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం అవసరం. వేసవి కాలం ఎండలు పెరిగేకొద్దీ ఈ ప్రశ్న కూడా మనస్సులో వస్తుంది, ఏమి తినాలి..? దేనికి దూరంగా ఉండాలి..? డ్రై ఫ్రూట్స్‌కు సంబంధించి కూడా ఈ గందరగోళం ఉంటుంది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ తినడంవల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే వేసవిలో వీటిని నానబెట్టి తినడం మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
సమ్మర్ వచ్చిందంటే చాలు.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అటువంటి వాటిలో రోజువారీ ఫుడ్ మెనూ లో తప్పనిసరిగా మార్పు చేర్పులు చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ తినడంవల్ల ఒంట్లో వేడి పెరిగి శరీరంపై చెమట పొక్కులు, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే డీహైడ్రేషన్ కు గురయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఇది కూడా చదవండి.. గుడ్లు కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ప్రోటీన్ లభించే ఆహారం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
