Oral health : బ్రష్ చేసినా నోటి దుర్వాసన వేధిస్తోందా..? ఈ సమస్యకు కారణాలేంటి.. చెక్‌ పెట్టే మార్గాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పొద్దున్నే బ్రష్ చేసి, మౌత్ వాష్ వాడినా కాసేపటికే మళ్లీ నోటి నుంచి దుర్వాసన వస్తోందా..? నలుగురిలో మాట్లాడాలంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోందా..? అయితే దీనిని తేలిగ్గా తీసిపారేయకండి. వైద్య పరిభాషలో దీనిని ‘హ్యాలిటోసిస్’ (Halitosis) అంటారు. చాలామంది తరచూ బ్రష్ చేయడం ద్వారా సమస్యను దాటవేయాలని చూస్తారు. కానీ, మూల కారణాన్ని గుర్తించి పరిష్కరించుకోవడం ఎంతో ముఖ్యమని దంత నిపుణులు చెబుతున్నారు. రోజంతా వేధించే నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలు, వాటిని ఎలా అధిగమించవచ్చొ తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలు..

నాలుకపై పేరుకుపోయే బ్యాక్టీరియా.. నోటి దుర్వాసనకు అత్యంత సహజమైన కారణం ఇది. ఆహారపు అవశేషాలు, మృతకణాలు నాలుకపై చేరి సల్ఫర్ సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. కేవలం పళ్లు మాత్రమే తోముకుని నాలుకను శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

దంతక్షయం, పిప్పి పళ్లు.. పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుపోయి కుళ్ళిపోయినప్పుడు తీవ్రమైన దుర్వాసన వెలువడుతుంది. నొప్పి లేకపోయినా లోపల దంతక్షయం పెరిగే ప్రమాదం ఉంటుంది. చిగుళ్ల సమస్యలు.. జింజివైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల చిగుళ్ల వాపు, రక్తస్రావం జరిగి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది తీవ్ర దుర్వాసనకు దారితీస్తుంది.

నోరు ఎండిపోవడం (Dry Mouth).. నోటిని శుభ్రంగా ఉంచడంలో లాలాజలం కీలక పాత్ర పోషిస్తుంది. నీరు తక్కువగా తాగడం, కొన్ని రకాల మందులు, నోటితో గాలి పీల్చడం వంటి కారణాల వల్ల లాలాజలం తగ్గి బ్యాక్టీరియా పెరుగుతుంది. టాన్సిల్ స్టోన్స్.. టాన్సిల్స్ గుంటల్లో ఆహార కణాలు, బ్యాక్టీరియా చేరి చిన్న చిన్న తెల్లటి రాళ్లుగా (Tonsil Stones) ఏర్పడతాయి. ఇవి తీవ్రమైన వాసనను వెదజల్లుతాయి. ఎసిడిటీ (Acidity)..కడుపులోని ఆమ్లాలు అన్నవాహిక గుండా పైకి వచ్చినప్పుడు నోట్లో చేదు, పులుపు రుచితో పాటు చెడు శ్వాస వస్తుంది.

సమస్య నుంచి బయటపడే సులువైన మార్గాలు.. 

క్రమం తప్పని పరిశుభ్రత..ఉదయం, రాత్రి పడుకునే ముందు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. నాలుకను శుభ్రపరచడం.. టంగ్ క్లీనర్ సాయంతో నాలుకపై పేరుకున్న పాచిని రోజూ మెల్లగా తొలగించాలి.

డెంటల్ ఫ్లాసింగ్.. బ్రష్ చేరుకోలేని పళ్ల సందుల్లోని ఆహార వ్యర్థాలను తొలగించడానికి నిత్యం ఫ్లాసింగ్ చేయాలి. తగినంత నీరు తాగడం.. లాలాజల ఉత్పత్తి సజావుగా సాగడానికి రోజుకు సరిపడా మంచినీరు తాగుతూ నోరు తేమగా ఉండేలా చూసుకోవాలి.

ధూమపానం, పొగాకుకు దూరం..ఇవి చిగుళ్ల వ్యాధులను పెంచి శ్వాసలో తీవ్ర దుర్వాసనను కలిగిస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. మౌత్‌వాష్‌లను వైద్యుల సలహా మేరకే పరిమితంగా వాడాలి. సమస్య ఎక్కువ కాలం కొనసాగితే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మేలు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.