40 సంవత్సరాలు దాటిన తర్వాత పురుషులలో వచ్చే అనారోగ్య సమస్యలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : 40 సంవత్సరాలు దాటిన తర్వాత శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలతో పాటు పురుషుల ఆరోగ్యం కూడా నలభై ఏళ్ల వయస్సు తరువాత ఎక్కువ శ్రద్ధ పెట్టాలని వారు అంటున్నారు. నాలుగు పదుల వయస్సు దాటాక శారీరక, మానసిక మార్పులు వస్తాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సరైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర, మానసిక ప్రశాంతతతోపాటు రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి..ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 9వ రోజు అనేక ప్రాంతాల్లో 300 దాటిన AQI.. 

ఇది కూడా చదవండి..మధుమేహం నియంత్రణలో ఉండకపోవడానికి ప్రధాన కారణాలు..? 

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ తగ్గాలంటే వీటిని అస్సలు తినకండి.. 

ఇది కూడా చదవండి..డిస్లెక్సియా అంటే ఏమిటి..? లక్షణాలు..?

 

40 ఏళ్ల తరువాత ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలు.. 

ప్రోస్టేట్ క్యాన్సర్.. 

పురుషులలో 40 ఏళ్ల తర్వాత ఎక్కువ మందిలో ప్రోస్టేట్ క్యాన్సర్ తలెత్తే అవకాశాలున్నాయి. అయితే, ఇది ముందుగా గుర్తించడం కష్టం. అందుకే,  ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (పిఎస్ఏ) పరీక్షలు, డిజిటల్ మల పరీక్షలు వంటి రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించడం ద్వారా ఈ క్యాన్సర్ ను ముందే గుర్తించవచ్చు.

కండరాల బలహీనత, ఎముకల సాంద్రత తగ్గడం..  

40 ఏళ్ల తరువాత, పురుషులలో సార్కోపెనియా, ఆస్టియోపెనియా వంటి పరిస్థితులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యలో కండరాల బలం, ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. తద్వారా ఎముకలు బలహీనమై, కండరాలు సరిగా పని చేయకపోవచ్చు. ఈ సమస్యలను నివారించేందుకు కండరాలను దృఢంగా పెంచే వ్యాయామాలు, ఎముకల సాంద్రతను మెరుగుపరిచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

హార్మోన్లలో మార్పులు..  

40 ఏళ్ల తర్వాత హార్మోన్స్ లో సహజంగా మార్పులు వస్తాయి. పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ మార్పుల కారణంగా డయాబెటీస్, బరువు పెరగడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే, ఆరోగ్యకరమైన ఆహారం, నిరంతర వ్యాయామం తప్పనిసరి.

ముందస్తు జాగ్రత్తలు..  

40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడమేకాకుండా రెగ్యులర్ గా పలురకాల వైద్యపరీక్షలు, స్క్రీనింగ్ చేయించాలి. ముఖ్యంగా వ్యాయామంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి.

వైద్య నిపుణులు సూచిస్తున్నట్లు, 40 ఏళ్ల తరువాత ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. నాలుగు పదుల వయస్సు తరువాత, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడంతోపాటు హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా యవ్వనంగా ఉండొచ్చు.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.