యూరిక్ యాసిడ్ తగ్గాలంటే వీటిని అస్సలు తినకండి.. 

షేర్ చేయండి:
యూరిక్ యాసిడ్ తగ్గాలంటే వీటిని అస్సలు తినకండి.. 

సాక్షి లైఫ్ : మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. గొడ్డు మాంసం, పంది మాంసం వంటి రెడ్ మీట్ లో అధిక మొత్తంలో ప్యూరిన్లు ఉంటాయి. కాబట్టి వీటిని తినకూడదు. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు మరింతగా పెరుగుతాయి. 

చికెన్ లివర్, మటన్ లివర్ వంటి అవయవ మాంసాలలో ఎక్కువ మొత్తంలో ప్యూరిన్లు ఉంటాయి. ఇవి కూడా తీసుకోకుండా ఉండాలి. సీ ఫుడ్ విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. రొయ్యలు, చేపలు, ఎండ్రకాయలు, గుల్లలు వంటి సముద్రపు ఆహారం కూడా తినకూడదు. ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది.

ఇది కూడా చదవండి..డిస్లెక్సియా అంటే ఏమిటి..? లక్షణాలు..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..? 

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? ఇది ఎంత ఉంటే నార్మల్..?

ఇది కూడా చదవండి..ఎయిడ్స్ శారీరకంగానే కాకుండా మానసిక అనారోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా..?

 

మద్యం సేవించడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి మద్యం సేవించడం పూర్తిగా మానెయ్యండి. చక్కెర తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కనుక ఇది కూడా తీసుకోకపోవడం మంచిది. డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వాళ్ళ కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కనుక వీటిని వీలైనంత తగ్గించడం ఉత్తమం.  

 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.