రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

షేర్ చేయండి:
రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

సాక్షి లైఫ్ : దానం చేసిన రక్తం ప్రమాదాలలో గాయపడిన వారికి, క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారికి, ఇతర కారణాల వల్ల రక్త రుగ్మతలతో బాధపడుతున్న వారికి సహాయపడుతుంది. అయితే ప్రస్తుతం నిరుపేదలకు రక్తం కొరత ఏర్పడుతోంది. పలు స్వచ్చంధ సంస్థలు రక్త నిధి కేంద్రాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా పేదవారికి ఉచితంగా రక్తాన్ని అందిస్తున్నాయి. ప్రాణాపాయ సమయంలో రక్తం అందక ఎంతోమంది తనువు చాలించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్త దానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   
 

ఇది కూడా చదవండి.. ఆస్తమాను అంతమొందిద్దాం.. 


రక్తం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. రక్తదానం వల్ల రక్తాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. రక్తదానం సహాయంతో, రక్తంలోని ఎర్ర కణాలు, ప్లాస్మా లేదా ప్లేట్‌లెట్స్ అనేక విధాలుగా అవసరమైన వారికి ఉపయోగపడుతాయి.

రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఉచిత ఆరోగ్య పరీక్షలు.. 
సంతోషకరమైన, దీర్ఘ జీవితం
శరీరంలోని ఐరన్ స్థాయిలను నిర్వహించవచ్చు. 
రక్తపోటు అదుపులో ఉంటుంది. 

 రక్తదానం చేయాలనుకుంటున్నవాళ్లు ఈ కింది వాటిని అనుసరించండి


పుష్కలంగా నీరు తాగాలి. 
రక్తం దానం చేసే ముందు తినాలి.. ఆకలితో ఇవ్వకూడదు. 
 కఠినమైన వ్యాయామం చేయకూడదు. రక్తం దానం చేసిన వెంటనే బరువులు ఎత్తకూడదు, అలాగే వెంటనే పరిగెత్తకూడదు.

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?  

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.