విటమిన్ బి12 లోపం వల్ల కూడా కంటి సమస్యలు తలెత్తుతాయా..?
సాక్షి లైఫ్ : మన శరీరం విటమిన్ B12ని స్వయంగా తయారు చేసుకోలేదు, కాబట్టి మనం దానిని పొందాలంటే.. మన ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా తీసుకోవాలి. శరీరంలో విటమిన్ బి 12 లోపించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యలు చెబుతున్నారు. విటమిన్ B12 అనేది శరీరంలోని అనేక విధులను నిర్వహించ డానికి బాధ్యత వహించే ముఖ్యమైన పోషకం. ఎర్ర రక్త కణాల ఏర్పాటు, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ నిర్వహణకు ఇది అవసరం.
ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి..
ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?
ఇది కూడా చదవండి..విటమిన్ "సి" లోపం చర్మ ఆరోగ్యంపై, ముఖ్యంగా పాదాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..పాదాల పగుళ్లకు ప్రధాన కారణాలు ఏమిటి..?
విటమిన్ B12 స్థాయి ఎంత ఉండాలి..?
300 pg/ml కంటే ఎక్కువ విటమిన్ B12 స్థాయిలు సాధారణమైనవిగా పరిగణిస్తారు. విటమిన్ B12 స్థాయిలు 200 pg/ml కంటే తక్కువగా ఉంటే దానిని విటమిన్ B12 లోపంగా పరిగణిస్తారు.
విటమిన్ B12 లోపించినప్పుడు కనిపించే లక్షణాలు..?
నీరసం..
విటమిన్ B12 లోపం వల్ల ప్రారంభ లక్షణాలలో అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఎర్ర రక్త కణాలు లేకుండా కణజాలాలు, అవయవాలు ఆక్సిజన్ పొందలేవు. ఇది అలసట - బలహీనతకు దారితీస్తుంది.
నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ బి12 అవసరం. తక్కువ B12 స్థాయిలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఏకాగ్రత చేయలేకపోవడం, జ్ఞాపకశక్తి సరిగా లేకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. తక్కువ విటమిన్ B12 మరొక సంకేతం చేతులు-కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తక్కువ B12 స్థాయిలు ఉన్న వ్యక్తుల్లో నోటిపూత ,నాలుకపై పొక్కులు వస్తాయి. ఇది కాకుండా నోటిలో బొబ్బలు, క్యాన్సర్ పుళ్ళు కూడా ఏర్పడవచ్చు. B12 లోపం కారణంగా కామెర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఆ సమయంలో చర్మం పసుపు రంగులోకి మారుతుంది.
ఇది కూడా చదవండి..పారాసిటమాల్ ఎంత మోతాదు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..నెమ్మదిగా కొలెస్ట్రాల్‌ను పెంచే ఐదు బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్..
ఇది కూడా చదవండి..వేసవికాలంలో కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించే ఉత్తమ చిట్కాలు..
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే 5 ఆహారాల గురించి తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
