పారాసిటమాల్ ఎంత మోతాదు తీసుకోవాలి..?
సాక్షి లైఫ్ : పారాసిటమాల్ పెద్దలకైతే ఒక మోతాదుకు ఒక గ్రాము తీసుకోవాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అలా ఒక రోజులో 4 గ్రాములకు మించి తీసుకోకూడదని వారు చెబుతున్నారు. ఒకవేళ వారికి ప్రతిరోజూ మద్యం సేవించే అలవాటు ఉండి ఉంటే ఇందులో సగం వంతు అంటే ఒక రోజులో రెండుగ్రాములకు మించి పారాసెటమాల్ తీసుకోకుడదని వైద్య నిపుణులువెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..గుండెపోటు వచ్చే ఒక నెల ముందుగా కనిపించే 6 సంకేతాలు..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?
పారాసెటమాల్ ఎలా తీసుకున్నా దాదాపు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఆల్కహాల్ సేవించినపుడు మాత్రం పారాసెటమాల్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆల్కహాల్‌లో ఇథనాల్ ఉంటుంది.
ఏ నొప్పి వచ్చినా సహజంగా చాలామంది పారాసిటమాల్ వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మద్యం తాగినప్పుడు హ్యాంగోవర్ సమయంలో పారాసిటమాల్ ఎందుకువేసుకోకూడదు..? ఒకవేళ వేసుకుంటే ఏమవుతుంది..? అనేదానిపై డాక్టర్లు ఏమంటున్నారు..?
పిల్లలకు వేసేటపుడు వైద్యనిపుణుల సలహా తీసుకోవాలి. సమస్య వచ్చిన ప్రతిసారి పారాసెటమాల్ ఇష్టారీతిన తీసుకోవడం మంచిది కాదు. అవసరం మేరకే, తక్కువ మోతాదు నుంచి తీసుకుంటుండం చేయాలి.
ఈ ఇథనాల్ సమ్మేళనం పారాసెటమాల్‌తో ప్రతిచర్య జరుపుతుంది. దీని కారణంగా వికారం, వాంతులు, తలనొప్పి, మూర్ఛ, అయోమయం వంటి సమస్యలు తలెత్తుతాయి.
రాత్రిపూట అతిగా మద్యం సేవించడంవల్ల కలిగే హ్యాంగోవర్‌ను వదిలించుకోవడం కోసం పారాసెటమాల్ అస్సలు తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక వల్ల కాలేయం విషపూరితంగా మారి ప్రాణాలకే ప్రమాదం జరగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
