సాక్షి లైఫ్ : మామిడి పండు అంటే ఇష్టపడనివారుండరు. చిన్నారుల నుంచి వృద్దులవరకు అందరూ అమితంగా తింటారు. ప్రపంచంలోని పండ్లన్నిటికీ రారాజు గా భావించే మామిడి పండుగురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. టీకా అనేది సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూలస్తంభం
యాంటీఆక్సిడెంట్లు..
ఒక కప్పు మామిడికాయ జ్యూస్ లో 100శాతం విటమిన్ "సి " తోపాటు పలురకాల పోషకాలుంటాయి. మామిడిపండ్లలో విటమిన్" ఎ", విటమిన్ "బి"తోపాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండులో ఉండే పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతేకాదు క్యాన్సర్ కణాలు, బ్యాక్టీరియాతోపాటు అనేక వైరస్‌లను అంతమొందించే గుణాలున్నాయి. మ్యాంగోలో ఉండే ఔషధగుణాలు కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచడమేకాకుండా కంటి చూపును సంరక్షించడంలోనూ కీలక పాత్రపోషిస్తాయి.
భారతదేశంలో 5,000 సంవత్సరాల క్రితం మామిడికాయలు అందుబాటులోకి వచ్చాయి. మామిడి క్రీస్తు పూర్వం 400సంవత్సరంలో ఆసియా నుంచి మిడిల్ ఈస్ట్ , ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో ప్రవేశించింది. మామిడి పండు, కాయల్లోనే కాదు, మామిడి ఆకుల్లో ఔషధగుణాలెన్నో ఉన్నాయి. అందుకోసమే ప్రతి శుభకార్యాల్లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తుంటారు.మామిడి ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి.. ఎలాంటి రోగాలకు యునాని ఉపయోగపడుతుంది..?
ఇవి మధుమేహం, రక్తపోటు, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లు, శ్వాసకోశ సమస్యలు, విరేచనాలకు చికిత్స చేయడంలో మామిడి ఆకులను వినియోగి స్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా 500 పైగా మామిడి పండ్ల రకాలున్నాయి. ఇవి వేసవిలో ఎక్కువగా పండుతాయి. వాటి రకాన్ని బట్టి పరిమాణామం, ఆకారం, రంగు, రుచి మారుతూ ఉంటాయి. కొన్ని నారింజ, పసుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉంటాయి.
నాలుగు రకాలు..
మామిడిలో కోత రకాలు, రసం రకాలు, పచ్చడి రకాలు,పునాసా రకాలు వంటి నాలుగు రకాలున్నాయి. వీటిలో కోత రకాలు : బంగినపల్లి, తోతాపురి, దశేరి, కేసర్, హిమాయత్, సువర్ణరేఖ ఉన్నాయి. రసం రకాల్లో చిన్నరసం, పెద్ద రసం, చెఱకు రసం, నవనీతం వంటివి ఉన్నాయి. పచ్చడి రకాల్లో జలాల్, హైదర్ సాహెబ్, ఆమిని, తెల్లగులాబి ఉన్నాయి. పునాసా రకాల్లో చిరుత పుడిగోవా లేదా రాయల్ స్పెషల్, బొబ్బిలి పునాసా, బారామసి వంటి రకాలున్నాయి.
జాతీయ వృక్షం..
2010లో బంగ్లాదేశ్ మామిడి చెట్టును జాతీయ వృక్షంగా ప్రకటించింది. ఇంతకు ముందు బంగ్లాదేశ్ కు జాతీయ వృక్షం అనేది లేదు. మామిడిపండ్లను ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో చైనా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాలతో పోలిస్తే భారతదేశం అగ్రస్థానంలో ఉండడం వల్ల భారతదేశాన్ని "ప్రపంచ మామిడి రాజధాని" అని పిలుస్తారు.
భారతదేశం, పాకిస్తాన్ , ఫిలిప్పీన్స్ దేశాలు మామిడిని తమ జాతీయ పండుగా స్వీకరించాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ క్రీ.శ. 1556-1605 మామిడిపండ్లను ఎంతగానో ఇష్టపడేవాడట, ఆయన బీహార్‌లోని దర్భంగాలో ఉన్న తన లఖీ బాగ్ తోటలో లక్ష మామిడి చెట్లను నాటినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి.. ఎండకాలంలో పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యం కోసం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com