Statin Medicines : అపోహలు వద్దు: స్టాటిన్స్ మెడిసిన్స్ తో ఎలాంటి ఇబ్బంది లేదు.. శాస్త్రవేత్తలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెపోటు ముప్పు నుంచి కాపాడే ‘స్టాటిన్‌’ (Statins) మందులపై వస్తున్న అపోహలకు తాజాగా తెరపడింది. ఈ మందుల వల్ల అనేక దుష్ప్రభావాలు (Side effects) కలుగుతాయని చాలామంది వీటిని వాడటానికి వెనుకాడతారు. అయితే, స్టాటిన్‌ మందులు గతంలో అనుకున్న దానికంటే అత్యంత సురక్షితమైనవని, ప్రాణాపాయం నుంచి ఇవి కాపాడతాయని ఒక భారీ విశ్లేషణాత్మక అధ్యయనం స్పష్టం చేసింది.

 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..Coconut Water : కొబ్బరి బొండం నీళ్లతో బరువు తగ్గొచ్చా..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

అపోహలు - వాస్తవాలు..

బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో జరిగిన ఈ పరిశోధన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ది లాన్సెట్’ (The Lancet)లో ప్రచురితమయ్యాయి. సుమారు 1.20 లక్షల మందిపై జరిపిన క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా శాస్త్రవేత్తలు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

 స్టాటిన్ల వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, కుంగుబాటు (Depression), నిద్రలేమి, బరువు పెరగడం, లైంగిక సామర్థ్యం తగ్గడం వంటివి జరుగుతాయని ప్రచారంలో ఉంది. కానీ, అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఈ లక్షణాలు మందులు వాడని వారితో సమానంగానే ఉన్నాయని, అంటే ఇవి మందుల వల్ల వచ్చినవి కావని తేలింది. ఈ మాత్రలు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించి, గుండెపోటు, స్ట్రోక్ ముప్పును సమర్థవంతంగా అడ్డుకుంటాయి.

భయాందోళనకు గురవుతున్నారని..

మందుల ప్యాకెట్లపై ఉండే ‘లీఫ్ లెట్స్’ లో అనేక దుష్ప్రభావాలను పేర్కొనడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి దూరంగా ఉన్న ఆ వివరాలను మార్చాలని వారు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ నియంత్రణలో లేని వారు వైద్యుల సలహా మేరకు  స్టాటిన్స్ ను వాడటం వల్ల దీర్ఘకాలంలో గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి..Obesity and inflammation : ఒబెసిటీకి ఇన్‌ఫ్లమేషన్‌కు లింక్ ఏమిటి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..Brain health : మీ బ్రెయిన్ కంప్యూటర్ లాగా పనిచేయాలంటే ఈ ఆహారపదార్థాలు తినండి..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.