Precautions : రేడియేషన్ థెరపీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమంటే..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ థెరపీ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ ప్రక్రియలో క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా ప్రభావితమవుతుంటాయి. ఈ సమయంలో శరీరం తిరిగి కోలుకోవాలన్నా, చికిత్స దుష్ప్రభావాలను తట్టుకోవాలన్నా సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?  

 

1. ప్రోటీన్‌..

రేడియేషన్ వల్ల దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరించడానికి శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్ అవసరం. ఏమి తీసుకోవాలి అంటే..?.. గుడ్లు, పప్పుధాన్యాలు, సోయా, పనీర్, చిక్కుళ్లు, లీన్ మీట్ అంటే చేపలు, చికెన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. ఘన పదార్థాలు తీసుకోలేని వారు ప్రోటీన్ షేక్స్ లేదా స్మూతీల రూపంలో తీసుకోవచ్చు.

2. తక్కువ మోతాదు.. ఎక్కువ సార్లు..!

చికిత్స సమయంలో ఆకలి మందగించడం సహజం. అందుకే ఒకేసారి భారీగా తినకుండా, తక్కువ పరిమాణంలో రోజుకు 5 నుంచి 6 సార్లు ఆహారం తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియపై ఒత్తిడి పడదు, శరీరానికి శక్తి నిరంతరం అందుతుంది.

3. 'నోటి' సమస్యలకు ఇలా చెక్..

తల, మెడ భాగంలో రేడియేషన్ తీసుకునే వారికి నోటి పూత (Mouth Sores) లేదా పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
కిచిడీ, ఉడికించిన కూరగాయలు, మెత్తగా చేసిన అరటిపండు, పెరుగు అన్నం వంటివి తీసుకోవాలి. దూరం పెట్టాల్సినవి.. మిరపకాయలు, మసాలాలు, నిమ్మ,నారింజ వంటి పుల్లటి పండ్లు, గరుకుగా ఉండే చిప్స్ వంటివి నోటి పూతను తీవ్రం చేస్తాయి.

4. డీహైడ్రేషన్ వద్దు..

రేడియేషన్ సమయంలో శరీరం త్వరగా అలసిపోతుంది. దీన్ని నివారించడానికి రోజుకు కనీసం 8-12 గ్లాసుల నీరు తాగాలి. నీరు మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ తీసుకోవడం ఉత్తమం.

5. జీర్ణకోశ సమస్యలు ఉంటే..
 
పొత్తికడుపు భాగంలో రేడియేషన్ తీసుకునే వారికి గ్యాస్, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ తగ్గాలంటే: క్యాబేజీ, బ్రోకలీ, బీన్స్ వంటి గ్యాస్ కలిగించే కూరగాయలను తాత్కాలికంగా తగ్గించాలి.

విరేచనాలు అవుతూ ఉంటే : పీచు తక్కువగా ఉండే ఆహారపదార్థాలు అరటిపండు, అన్నం, ఉడికించిన బంగాళదుంపలు మేలు చేస్తాయి. రేడియేషన్ థెరపీ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి పచ్చి కూరగాయలు (Salads), సగం ఉడికిన మాంసం లేదా గుడ్లు, శుద్ధి చేయని పాలు తీసుకోకూడదు. ఆహారం ఎప్పుడూ వేడిగా, బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి. 

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.