కందిపప్పు షుగర్ ని కంట్రోల్ చేస్తుందా..?
సాక్షి లైఫ్: డయాబెటిస్ ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతోంది. షుగర్ ను అదుపులో ఉంచేందుకు మందులు కాకుండా సహజంగా పలు చిట్కాలను అనుసరించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా కందిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు వెల్లడిస్తున్నారు. షుగర్ రోగులకు సరైన ఆహారంతో పాటు వ్యాయామం అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
కందిపప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో బీపీని నియంత్రించే గుణాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిక్ పేషెంట్లకు కందిపప్పు ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం..
ఒత్తిడి..
ఒత్తిడి పెరగడం వల్ల, మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరగడం ప్రారంభమవుతుంది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. కందిపప్పులో అధిక యాంటీఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. కందిపప్పు నిత్యం తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అంతేకాదు మొలకెత్తిన పచ్చి పప్పులు హైపర్‌గ్లైసీమియా అంటే అధిక బ్లడ్ షుగర్ ను నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అధిక మొత్తంలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర వేగంగా పెరగదు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది..
డయాబెటిక్ రోగులలో సహజంగానే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకనే ఒక్కోసారి షుగర్ ఉన్నవారు త్వరగా అనారోగ్యానికి గురవుతారని వైద్య నిపుణులు అంటున్నారు. కందిపప్పుతోపాటు ఇతర పప్పుధాన్యాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
బరువు తగ్గుతారు..
డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగు తాయి. కాబట్టి వారు తీసుకునే ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కందిపప్పు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. పప్పులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.
అంతేకాదు కందిపప్పు తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీనితో పాటు, అతిగా తినడాన్ని కూడా నివారించవచ్చు. తద్వారా బరువుకూడా తగ్గడానికి అవకాశం ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
